నన్ను చంపాలని ముగ్గరు ప్లాన్ చేస్తున్నారు..పవన్ షాకింగ్ కామెంట్స్

466

ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజకీయంగా ఏపీలో వినిపిస్తున్న పొలిటిక‌ల్ స్టార్ పేరు.. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ పోరాట‌యాత్ర‌తో బిజిబిజిగా ఉన్నారు.. ఇటు జ‌గ‌న్ పాద‌యాత్ర ప‌వ‌న్ పోరాట యాత్ర‌ల‌తో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది.. ఇక ఏపీలో యాత్ర‌ల‌తో తెలుగుదేశం వైసీపీ పై విమ‌ర్శ‌ల బాణాలు సందిస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. తాజాగా ఆయ‌న దెందులూరు స‌భ‌లో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పై విమ‌ర్శ‌లు చేశారు. దానికి ఆయ‌న కౌంట‌ర్లు ఇచ్చారు. ఇక ఈ స‌మ‌యంలో ప‌శ్చిమ‌యాత్ర‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

తన హత్యకు కుట్ర జరుగుతోందంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముగ్గురు కలిసి హత్య చేసేందుకు ప్లాన్ చేశారని.. తనకు తెలిసిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జనసేనపోరాట యాత్రలో భాగంగా ఏలూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మొన్నా మధ్య అధికారపక్షమో.. ప్రతిపక్షమో తెలియదు కాని.. ముగ్గురు క్రిమినల్స్.. మాట్లాడుకుంటున్న మాటలు రికార్డ్ చేసి పెట్టారు.. ఆ మాటల్ని నాకు వినిపించారు. ఎన్నికల్లోపు పవన్ కళ్యాణ్‌ను చంపేయొచ్చు కదా అని అనుకున్నారు. త‌న పై కుట్రలు ప‌న్నుతున్నారు రాజ‌కీయంగా న‌న్ను ఎదుర్కోలేక ఇటువంటి ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు, నాకు ప్ర‌జ‌ల స‌పోర్ట్ పెరుగుతోంది అని వారు కంగారు ప‌డుతున్నారు అని ప‌వ‌న్ అన్నారు, ఇక జ‌న‌సేన‌కు ఉన్న జ‌న‌సైన్యాన్ని చూసి వారు కంగారుప‌డుతున్నారు అని, వారిని ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ‌తాను, త‌న‌కు ఏమైనా నా పార్టీ సిద్దాంతాలు మీద‌గ్గ‌ర ఉన్నాయి అనేలా జ‌న‌సేనాని త‌న ప్ర‌సంగాన్ని చేశారు.

అదే జరిగితే ఏమవుతుంది.. ఒక నెలరోజులు గొడవ అవుతుంది.. అప్పుడు అధికారపక్షం మీద ప్రతిపక్షం.. ప్రతిపక్షం మీద అధికారపక్షం తోసేయొచ్చు. తోసేస్తే ఇద్దరం కొట్టుకుంటే.. ఇద్దర్లో ఎవరో ఒకరం గెలుస్తామనుకున్నారు. ఈ మాటలు వింటే బాధగా ఉంది. వాళ్లెవరో కూడా నాకు తెలుసు.. ఏ పార్టీ వాళ్లో కూడా నాకు తెలుసు.. వాళ్ల పేర్లూ తెలుసు.. వాళ్ల మొహాలు తెలుసు.. వీటికి భయడపతానా నేను.. భయపడే ప్రసక్తే లేదన్నారు’పవన్.పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జనసేనాని ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది చర్చనీయాంశమయ్యింది. అయితే ప్లాన్ చేసింది ఎవరో తనకు తెలుసన్న పవన్.. వారి పేర్లను మాత్రం బయటపెట్టలేదు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇలాంటి సెన్సేష‌న్ కామెంట్లు చేయ‌డం ఇది కొత్త ఏమీ కాదు.. గ‌తంలో మీడియాల‌పై ఇలా ఎల్లో మీడియాలు అంటూ ట్వీట్లు పెట్టారు, ఈ స‌మ‌యంలో ప‌లు విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు అంద‌రూ. ఇక ఆయ‌న అభిమానులు కూడా ఎల్లోమీడియాని బ్యాన్ చేయాలి అని ట్రోల్స్ చేశారు. ఇప్పుడు ప‌వ‌న్ ఏకంగా త‌న‌నే టార్గెట్ చేశారు అని చెప్ప‌డంతో పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ అయింది.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇలా అన‌డంతో ఆయ‌న అభిమానులు ఆందోళ‌న‌లో ఉన్నారు.