మార్చి 14న పవన్ కల్యాణ్ మరో సంచలనం

167

ఏపీలో జనసేన మరో సంచలనానికి రెడీ అవుతోంది, జనసేనాని ప్రత్యర్ధులకు ఇప్పటికే కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు.. ఈ కార్యక్రమంలో పార్టీలను షేక్ చేయనున్నారు పవన్ కల్యాణ్.. ఏపీలో మార్చి 14 జనసేన పార్టి ఆవిర్బావ దినోత్సవం జరుగనుంది.ఇక జనసైనికులు ఈ పండుగ కోసం ఎదురుచూస్తున్నారు…రాజమండ్రిలో భారి బహిరంగ సభ జరగబోతుంది,ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు,జనసేన నాయకులు, పార్టీ తరపున సీటు టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావాహులు హజరవనున్నారు..175 స్థానాలకు అభ్యర్దుల జాబితాను ఓకేసారి పబ్లిక్ గా పవన్ ఈరోజు తెలియచేస్తారా అనే ఆలోచన కూడా నాయకుల్లో జన సైనికుల్లో ఉంది. ఇక ప‌వ‌న్ ఎప్పుడు ఈ అభ్య‌ర్దుల లిస్ట్ బ‌య‌ట‌కు వ‌దులుతారు అని జ‌న‌సైనికులు ఎదురుచూస్తున్నారు.

Image result for JANASENA SPEECH

మునుపెన్నడు ఏరాజకీయ పార్టీ చేయని విధంగా, సీట్లు ఇవ్వడానికి జనసేన రెడీ అవుతోంది… రాజకీయ చరిత్రలోనే మరో ప్రభంజనం సృష్టించేందుకు పవన్ కల్యాణ్ సిద్దం అవుతున్నారు. జనసేన పార్టీ తూర్పుగోదావ‌రి జిల్లాలో మరింత దూసుకుపోతోంది .ఇక్కడ పెట్టే ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవుతుంది అని చెప్పాలి…ధవళేశ్వరంలో గతంలో చేసిన కవాతును పది రేట్లు తలపించబోయే విధంగా ఈ పార్టీ ఆవిర్బావ దినోత్సవ కార్యక్రమం చేయాలి అని చూస్తున్నారు పార్టీ శ్రేణులు.

ఈ క్రింది వీడియో చూడండి 

రాజమండ్రిలో జరిగే ఈ సభలో పవన్ మరో సంచలనానికి నాంది పలుకనున్నారు అని తెలుస్తోంది. ఈ సభ నుండే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను,పార్టీ మేనిఫెస్టో ని ప్రకటించనున్నారు అని టాక్ . అందుకే జనసేన సైనికులు నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు అవ్వాలి అని చూస్తున్నారు.. గ్లాసు గుర్తు ఇప్పటికే ప్రజల్లో బలంగా తీసుకువెళ్లిన జనసేన ఇప్పుడు మేనిఫెస్టోని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లనుంది.