చంద్ర‌బాబుకి కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ జీవితంలో ఆపని చేయ‌ను

176

ఈసారి ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి వ‌చ్చిన రిజ‌ల్ట్ చూస్తే ఇక ఆ పార్టీ ఎలా ముందుకు వెళుతుందా అనే అనుమానం అయితే క‌లుగుతుంది..ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే మరో ఐదేళ్ళలో కూడా టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపించడంలేదు. ఇక ఎన్నికల ముందు ఎన్నో అంచనాలు పెట్టుకుని బరిలోకి దిగిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలగింది. అంతేకాదు పోటీ చేసిన రెండు స్థానాలలో కూడా జనసేన అధినేత పవన్ ఓటమి పాలయ్యారు.

Image result for pawan and chandrababu

అయితే ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ మరీ ఇంత మెజారిటీతో గెలవడం, టీడీపీ దారుణంగా ఓడిపోవడానికి ముఖ్య కారణం జనసేన అని కూడా చెప్పవచ్చు. 2014 ఎన్నికలలో టీడీపీకి బీజేపీ, పవన్ మద్ధతు దొరకడంతో సునాయాసంగా గెలిచిపోయింది. అయితే ఈ ఎన్నికలలో హోదా విషయంలో చంద్రబాబు బీజేపీతో కొట్లాటకు దిగి వారితో పూర్తిగా తెగదింపులు జరుపుకోవడం, ఇటు పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా కొన్ని ఓట్లు చీల్చడం టీడీపీనీ బాగా దెబ్బకొట్టాయి. అయితే గత ఎన్నికల కన్నా టీడీపీకి ఈ సారి ఓటు బ్యాంకింగ్ పెరిగినా కూడా ఘోర ఓటమి పాలయ్యింది. అయితే పార్టీనీ మళ్ళీ పుంజుకునేలా చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు రచిస్తున్నారట. అయితే టీడీపీ జనసేనతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన టీడీపీ నేతలతో చంద్రబాబు చేసారని అంతేకాకుండా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే పొత్తును కొనసాగించాలని ఆలోచనలు చేస్తున్నారట. అయితే దీనికి చంద్రబాబు కూడా రెడీ అయ్యారని టీడీపీ పొత్తుతో పవన్ కూడా సుముఖంగా ఉన్నారని నిన్నటి నుంచి ఎల్లో మీడియా బాగా ప్రచారం చేస్తుంది.

ఈ క్రింద వీడియోని చూడండి

అయితే ఈ వార్తలపై స్పందించిన జనసేన ఎల్లో మీడియాకు తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉందే తప్ప, మీ పొత్తుతో జనసేనకు ఎటువంటి సంబంధం లేదు. మీలాంటి విలువలు లేని మీడియాతో, విలువలు లేని పార్టీతో ఇక మళ్ళీ కలవడానికి మేము సిద్దంగా లేమని ఎన్నికల ముందు ఇలానే ప్రచారం చేసి, మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేసి మా పార్టీ నైతిక విలువలను దెబ్బ కొట్టాలని చూస్తే చూస్తు ఊరుకోమని టీడీపీ శ్రేణులకు, ఎల్లో మీడియాకు జనసేనాని గట్టిగానే సమాధానం ఇచ్చారు. అయితే రాజకీయాలో ఒక మాటపై నిలబడడం నాయకులకు కాస్త కష్టమే. మరి టీడీపీ చెబుతునట్టు పవన్ పొత్తు పెట్టుకుంటారా, లేక విలువలకు కట్టుబడి ఉంటారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.