సిక్కోలులో వైసీపీ – టీడీపీ వార్

430

ఉత్త‌రాంధ్రాలోని కీల‌క‌మైన జిల్లా శ్రీకాకుళం… రాజ‌కీయాల‌కు కూడా పెట్టింది పేరు… కాంగ్రెస్ టీడీపీలు పోటా పోటీగా కంచుకోట‌గా రెండు ద‌శాబ్దాల చ‌రిత్ర క‌లిగిన అసెంబ్లీ సెగ్మెంట్లు క‌లిగిన జిల్లా శ్రీకాకుళం. ఇక ఈ జిల్లా రాజ‌కీయాల్లో ప‌లాస గురించి చ‌ర్చించుకోవాలి.. ఇక్క‌డ అధికార పార్టీ అభివృద్దిని ప‌క్క‌న పెట్టింద‌ని ప్ర‌చార ఆర్బాటాల‌కు స‌మ‌యం కేటాయింస్తోంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Image result for gouthu sivaji

ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ నేత గౌతు శివాజీ తెలుగుదేశం త‌ర‌పున విజ‌యం సాధించారు..వ‌జ్జా బాబురావు వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. ఇక ఇక్క‌డ వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్ గా ఉన్న డాక్టర్‌ సీదిరి అప్పలరాజు టీడీపీ నేత‌ల‌కు జిల్లా అధ్య‌క్షురాలు గౌతు శిరీష కు ఓ స‌వాల్ విసిరారు.పలాస‌లో ఎటువంటి అభివృద్ది కార్య‌క్ర‌మాలు మీరు చేప‌ట్టారో చ‌ర్చ‌కు రావాల‌ని సాక్ష్యాదారాల‌తో చూపించాల‌ని ఆయ‌న స‌వాల్ చేశారు.

Image result for gouthu sirisha

నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్దిజ‌రిగింది అని శిరీష చెబుతున్నారు అని ఆ మాట‌లు ఎంత వాస్త‌వ‌మో నిరూపించాలి అని ఆయ‌న స‌వాల్ చేశారు..గెడ్డందీక్షలు, మౌనదీక్షల వల్ల ఫలితం ఉండదని, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ ధనంజయరెడ్డి ఇళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆందోళన చేస్తే ఫలితం ఉంటుందని సూచించారు. కేవలం సీనియ‌ర్ ఎమ్మెల్యేగా శివాజీ ఉన్నారు మినహా, ఆయ‌న‌కు అభివృద్ది అంటే ఏమిటో తెలియ‌దు అని విరుచుకుప‌డ్డారు. మొత్తానికి ఇక్క‌డ అధికారంలో ఉన్నా టీడీపీకి వైసీపీ కాస్త హీట్ పుట్టిస్తోంది.. అయితే ఇక్క‌డ విజ‌యం అంత సుల‌భంగా చెప్ప‌లేం.. ఇరువురికి స‌మాంత‌ర‌మైన కేడ‌ర్ ఉంది ..ప్ర‌జాబ‌లం ఉంది… ప‌లాస ప్రజానాడి ప‌ట్టుకోవ‌డం అంత సుల‌భం కాదు.