ప‌ర‌కాల‌ టీడీపీకే సొంతం

269

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి టిక్కెట్ల లొల్లి ఏపీలో ఎలా ఉందో తెలిసిందే, ముఖ్యంగా అధికార పార్టీ కాబ‌ట్టి ఇక్క‌డ పార్టీ త‌ర‌పున ఆశావాహులు కూడా చాలా మంది ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ త‌ర‌పున స‌ర్వేల‌తో టిక్కెట్లు ఇస్తారు అని అంటున్నారు. కాని తెలంగాణ‌లో మ‌హా కూట‌మిలో ఉండట‌తంతో ఇప్పుడు కొన్ని తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల్లో స‌ర్దుబాటు చేసుకుంటున్నాయి తాజాగా ఓ లిస్టు కూడాప్ర‌క‌టించింది తెలుగుదేశం పార్టీ.

Image result for tdp
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి పరకాల నియోజకవర్గం టికెట్‌ తెలుగుదేశం పార్టీకే కేటాయిస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాసాచారి అన్నారు. ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసచారి మాట్లాడుతూ… తాము తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డితో కలిసి చంద్రబాబును కలిసినట్లు పేర్కొన్నారు. తప్పకుండా పరకాల టికెట్‌ టీడీపీకే కేటాయించేలా చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిపారు.