వైసీపీ నేత‌ల‌కు కొత్త వాహనాలు

457

వైసీపీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి రేపు తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌గ్గంపేట‌లో ఏర్పాటు చేసిన స‌మావేశానికి రాష్ట్రంలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల హాజ‌రుకానున్నారు ఇప్ప‌టికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Image result for ycp leaders in jagan party office

ఆదివారం ఉదయం 11 గంటల నుండి 11:30 గంటల వరకు పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్ల సమావేశం జరుగునుంది, ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం జరుగుతుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా రావాలని పార్టీ అధ్యక్షులు ఆదేశించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Related image

ఇక ఈ స‌మావేశంలో ఏం చ‌ర్చింనున్నారా అని ఉత్సుక‌త నాయ‌కులు అంద‌రిలో మ‌రింత పెరిగింది..పాదయాత్రలో 100వ నియోజకవర్గంగా నిలిచిన జగ్గంపేటలో కీలక సమావేశం జరగడం విశేషం.నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల‌కు కొత్త వాహనాలు ఇవ్వ‌నున్నారు అని తెలుస్తోంది… ఈ వాహ‌నాల‌లో నాయ‌కులు నియోజ‌క‌వ‌ర్గ గ్రామాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు అని తెలుస్తోంది….55 రోజుల పాటు ఈ నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌టన‌లు చేసే విధంగా వైసీపీ అధినేత కొత్త నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.