అక్టోబరు నుంచి కొత్త ఆఫ‌ర్ – మంత్రి లోకేష్

533

ఏపీలో ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల క‌ల‌లు నెర‌వేరే స‌మ‌యం ఆస‌న్న‌మైంది.. అక్టోబ‌రు నుంచి అర్హులైన నిరుద్యోగులు అంద‌రికి నిరుద్యోగ భృతి ఇచ్చేలా ఏపీ స‌ర్కారు ఆలోచిస్తోంది.. వచ్చే నెల నుంచి నిరుద్యోగులు పేర్లను నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్‌ యాప్‌, వెబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని… రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు.

Image result for nara lokesh

ఆయ‌న ఇటీవ‌లే ఐటీ అధికారుల‌తో ఈ విష‌యం పై చ‌ర్చించారు… ఈ విష‌యంలో ఈ-ప్రగతి విభాగానికి, డేటాను అందించే బాధ్యత, ఆర్టీజీఎస్‌కు అప్పగించారు…ఈ నెల 24 కల్లా యాప్‌, పోర్టల్‌ను సిద్ధం చేసి అదే రోజు పరిశీలించాలని నిర్ణయించారు నారాలోకేష్.. ఇక అధికారుల‌కు ఇదే ఫైన‌ల్ అని తెలియ‌చేశారు మంత్రి.

Image result for nara lokesh

ఇక నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు కూడా ఇందులో న‌మోదు చేసుకోవ‌చ్చు అని తెలియ‌చేశారు..ఆ కంపెనీలు న‌మోదు చేసుకునేందుకు వీలుగా వెబ్ సైట్ సిద్దం అవుతోంది.. కంపెనీల సమాచారాన్ని పరిశ్రమల శాఖ సేకరించి, ఆయా కంపెనీల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా వెసులుబాటు కల్పించేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు.

Image result for nara lokesh

నిరుద్యోగ భృతితో పాటు వారికి ఉద్యోగాలు క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వం పై ఉంది అని ,అది క‌చ్చితంగా చేస్తామ‌న్నారు ఆయ‌న‌.రాష్ట్రంలో నిరుద్యోగభృతికి అర్హులుగా అంచనా వేసిన 10లక్షల మందికి ఈ అప్రెంటిస్‌ పథకం కింద వివిధ కంపెనీల్లో అప్రెంటిస్‌లుగా చేర్పిస్తారు. శిక్షణపొందాక అదే కంపెనీలో వీరు రెగ్యులర్‌ ఉద్యోగులుగా చేరేందుకు తోడ్పడాలని మెజారిటీ అధికారులు సమావేశంలో అభిప్రాయపడ్డారు.