కాంగ్రెస్ ఏపీలో కొత్త ప్ర‌యోగం

373

కాంగ్రెస్ పార్టీ ఏపీలో పీహెచ్ డీ చ‌దివి న‌ర్స‌రీకి వ‌చ్చిన స్దితిలోకి వ‌చ్చేసింది.. ఇప్పుడు మ‌ళ్లీ మొద‌టి నుంచి త‌మ రాజ‌కీయాలు స్టార్ట్ చేయాలి.. ఇప్పుడు కేడ‌ర్ కాదు కదా పీసీసీ కార్యాల‌యాలు ఎక్క‌డ ఉన్నాయో కూడా అంతుచిక్క‌ని ప‌రిస్దితి ఏర్ప‌డింది.. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఏపీలో పోటా పోటిగా ఉండేవి.. ఇప్పుడు కాంగ్రెస్ బాధ్య‌త వైసీపీ తీసుకుంది. ఇక తెలుగుదేశం వైసీపీ బీజేపీ సాధించ‌నివి అన్నీ తాము చేస్తాము అని అంటున్నారు.. ఏపీకి రైల్వే జోన్ అలాగే ప్ర‌త్యేక హూదా ఇక కేంద్రం సాయం అన్ని చేస్తాము అంటున్నారు.. తాజాగా జ‌గ‌న్ తెలుగుదేశం చేతులు ఎత్తేసిన కాపు రిజ‌ర్వేష‌న్ అంశం లోకూడా కాంగ్రెస్ చేయిపెట్టింది.. తాము అధికారంలోకి వ‌స్తే ఏపీలో ఉన్న అన్ని స‌మ‌స్య‌లు తీర్చుతాము అని అంటున్నారు.

Image result for congress

తెలుగుదేశాన్ని ఒక మాట కూడా అన‌కుండా ఈ తొమ్మిది నెల‌లుగా కేంద్రం ద‌గ్గ‌ర పెండింగ్ లో ఉన్న కాపుల అంశం పై జ‌గ‌న్ తాజాగా మాట్లాడ‌టం తెలిసిందే.. త‌న వ‌ల్ల అయ్యే హామీలు మాత్ర‌మే ఇస్తాను అని ఆయ‌న అన్నారు… ఇక కాపుల రిజర్వేషన్లపై జగన్‌ యూటర్న్ తీసుకున్నారని, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఊమెన్ చాందీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కాపుల‌కు ఎప్పుడూ అండ‌గా ఉంటుంది అని అన్నారు.

Image result for congress  umeb chandi incharge ap pcc

ఇక అధికారంలోకి వ‌స్తే కాపుల‌కు రిజ‌ర్వేషన్లు ఇస్తామ‌ని గ‌తంలో కాపుల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయ‌న అన్నారు.. ఇప్పుడు కూడాకాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేత‌ల‌ను తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి అని.. వారిని పార్టీలోకి తీసుకువ‌స్తాము అని అన్నారు ఆయ‌న‌… మ‌రి చూడాలి ఏది అయినా సాధిస్తాం తిరిగి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని తెలుగుదేశం అంటోంది.. ఇక హామీలే ప‌ర‌మావ‌ధిగా జ‌గ‌న్ పాద‌యాత్ర ముందుకు కొన‌సాగుతోంది…ఇక వీరు చేయ‌ని ప‌నులు అన్నీ తాము చేస్తాము అంటూ ముందుకు వెళుతోంది కొత్త పందాలో కాంగ్రెస్ పార్టీ. వెయిట్ అంట్ సీ ఏం జ‌రుగుతుందో.