ల‌గ‌డ‌పాటి స‌ర్వే పై కొత్త వాద‌న

400

ఏపీలో స‌ర్వే అన‌గానే ముందు వినిపించే పేరు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్, ఆయ‌న మాజీ ఎంపీగా విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌కే కాదు రాష్ట్ర విభ‌జ‌న‌లో స‌మైఖ్యాంద్రా కోసం కంకణం క‌ట్టుకున్న నేత‌గా ఉన్నారు.. ఇక ఆయ‌న పేరుమీద ఎటువంటి స‌ర్వే అంటూ వార్త‌లు వ‌చ్చినా ఏపీలో రాజ‌కీయ నాయ‌కులు కూడా షేక్ అవుతారు. ఇక తాజాగా ఆర్జే ఫ్లాష్ స‌ర్వే అంటూ వార్త‌లు వ‌చ్చాయి.. దీనిపై మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స్పందించారు.

Image result for lagadapati rajagopal

ఆ సర్వే తనది కాదంటూ.. తనకు ఎలాంటి సంబంధం లేదని మీడియా ద్వారా తెలిపారు. సోషల్ మీడియా లో వస్తున్న ప్రచారాలు అబద్ధాలని తన సర్వే ఎన్నికల షెడ్యూల్ తరువాత, నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన త‌ర్వాత‌ వెల్లడిస్తాని రాజ్ గోపాల్ క్లారిటీ ఇచ్చారు.. అయితే ఇటువంటి స‌ర్వేల విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాల‌ని, త‌న నుంచి వ‌చ్చేది తాను ప్ర‌క‌టిస్తాను అని, ఇలా సీక్రెట్ గా వ‌చ్చే స‌ర్వేలు త‌న‌వి కావు అని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స్ప‌ష్టం చేశారు.

Image result for lagadapati rajagopal

ఏపీలో వైసీపీకి అనుకూలంగా తెలంగాణ‌లో టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓ స‌ర్వే వైర‌ల్ అవుతోంది.. దీంతో ఈ స‌ర్వేల ప్ర‌కారం వైసీపీ విజ‌యం త‌థ్యం ఏపీలో, అలాగే టీఆర్ ఎస్ విజ‌యం త‌థ్యం తెలంగాణ‌లో, అంటూ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి.. కాని ఇది అవాస్త‌వ‌మైన పోస్టు అని ఆయ‌నక్లారిటీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇలా వైర‌ల్ అయ్యే వార్త‌ల్లో ఏది క‌రెక్ట్ ఏది ఫేక్ అనేది మాత్రం తెలుసుకోవ‌డం కాస్త క‌ష్ట‌మ‌నే చెప్పాలి.