టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే

380

తెలుగుదేశం పార్టీలోకి మ‌ళ్లీ వ‌ల‌స‌లు స్టార్ట్ అవుతున్నాయి ఇప్ప‌టికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది నాయ‌కులు వైసీపీ తెలుగుదేశంలో చేరారు ఈ స‌మ‌యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి కొంద‌రు వ‌స్తారు అని అంటుంటే అనూహ్యంగా చాలా మంది తెలుగుదేశం వైపు కూడా చూస్తున్నారు తాజాగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ పుంజుకుంది అనే చెప్పాలి ఇక్క‌డ నుంచి మ‌రో నాయ‌కుడు తెలుగుదేశంలో చేరేందుకు రెడీ అయ్యారు. సైకిల్ ఎక్కేందుకు ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే నీలకంఠం నాయుడు సిద్దం అయ్యారు.

Image result for neelakantam naidu

శ్రీకాకుళం జిల్లాలో మరో సీనియర్‌ నేత సైకిల్ ఎక్కనున్నారు అని ఇప్ప‌టికే అనేక వార్త‌లు వినిపించాయి.. క‌థ‌నాలు వ‌చ్చాయి ఇక ఎచ్చెర్ల‌లో అంద‌రూ గ‌త వారంగాఇదే చ‌ర్చించుకున్నారు. చివ‌ర‌కు ఇదే ఫైన‌ల్ అయింది…ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో మాజీమంత్రి కోండ్రు మురళిమోహన్‌ చేరగా, అదేబాటలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు పయనించనున్నారు.. దీనిపై ఆయ‌న స‌న్నిహితులు నాయ‌కులు క్లారిటీ ఇచ్చారు.

Image result for neelakantam naidu

2009లో కాంగ్రెస్‌ తరఫున ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరారు. ఆ పార్టీలో సీనియార్టీకి తగిన గుర్తింపు లభించకపోవడంతో ఆయన టీడీపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రి కళా వెంకటరావుతో ఉన్న బంధుత్వంతో త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆయ‌న‌కు ఇప్ప‌ట‌కే ఇక్క‌డ కేడ‌ర్ బ‌లంగా ఉంది అలాగే ఆయ‌న‌కు కాంగ్రెస్ త‌ర‌పున కేడ‌ర వైసీపీ త‌ర‌పున కేడ‌ర్ బ‌లంగా ఉండ‌టంతో ఇది టీడీపీకి మ‌రింత ప్ల‌స్ అవ్వ‌నుంది.