30 రోజుల్లో వైసీపీలోకి

353

బీజేపీ బ‌హిష్కృత నేత మాజీ ముఖ్య‌మంత్రి జనార్దన్‌రెడ్డి తనయుడు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి త‌న స్పీడును పెంచారు మూడు నెలల్లో త‌న రాజ‌కీయ కార్య‌చ‌ర‌ణ చెబుతా అన్నారు అలాగే వైసీపీలో చేరుతున్న‌ట్లు తెలియ‌చేశారు.. ఇక సెప్టెంబ‌ర్ లో తాను వైసీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఆయ‌న .నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గ‌పోరు లేకుండా మిగిలిన వారిని కూడా క‌లుపుకుని ముందుకు వెళ్లే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్నారు.. ఇక ఆనం ఫ్యామిలీ నేదురుమ‌ల్లి ఫ్యామిలీ వైసీపీ ఎంట్రీతో ఇక్క‌డ వైసీపీ బ‌లం మ‌రింత పెర‌గ‌నుంది.

Image result for నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి

గూడూరు, చెన్నూరు, చిల్లకూరు ప్రాంతాల వైసీపీ ముఖ్య నేతలతో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు.. మ‌నం అంద‌రం క‌లిసి ప‌ని చేయాల‌ని చెప్పారు… ఇక వైసీపీ బ‌లోపేతం అయ్యేందుకు మ‌రింత క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని తెలియ‌చేశారు.. సెప్టెంబ‌ర్ లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరుతున్నాను అని డేట్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా అని చెప్పారు రాం కుమార్ రెడ్డి..

Image result for Nedurumalli Ramkumar Reddy

ఇక ఆయ‌న కోరుకునే చోట సీటు ఇవ్వ‌డానికి ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గం త‌ర‌పున ఉన్న నాయ‌కులు ఒప్పుకోరు .. ఈస‌మ‌యంలో రాంకుమార్ రెడ్డికి ఎటువంటి ప‌ద‌వి ఇస్తారా అని ఆలోచ‌న అయితే ఇటు నాయ‌కుల్లో జిల్లా ప్ర‌జ‌ల్లో పెరిగిపోయింది.. తండ్రి ముఖ్య‌మంత్రిగా చేశారు త‌ల్లి మంత్రిగా చేశారు ఇక త‌న‌యుడు కూడా అటువంటి ప‌ద‌వుల్లో ఉండాల‌ని ఆయన కేడ‌ర కోరుకుంటోంది మ‌రి ఆయ‌న‌కు జ‌గ‌న్ ఎటువంటి ప‌ద‌వి ఇస్తారో చూడాలి.