AP లో చిరంజీవికి BJP కీలక పదవి

908

మెగాస్టార్ చిరంజీవి బిజెపిలోకి వెళ్ళబోతు న్నారా…? ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఆయన త్వరలోనే కాషాయం కండువా కప్పుకుంటారా ? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తోంది. ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోవాలని భావిస్తున్న బిజెపి 2024 ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వటానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది. టీడీపీ కి చెందిన అనేకమంది నేతలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ పెద్ద పావులు కదుపుతున్నారు, దాదాపు కాపు సామజిక వర్గానికి చెందిన అనేక మంది నేతలను బీజేపీ దాదాపుగా తమ పార్టీలోకి లాగినట్లే అని తెలుస్తుంది. ఆంధ్రలో రెడ్డి సామజిక వర్గం వైసీపీకి కమ్మ సామాజికవర్గం టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నట్టే కాపు సామాజిక వర్గం బీజేపీకి అన్నట్లు సమీకరణాలు సిద్ధంచేసి బీజేపీ వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే టిడిపిని టార్గెట్ చేసి నలుగురు రాజ్యసభ సభ్యులను తన పార్టీలో కలిపేసుకుంది. టిడిపి నుంచి ఇంకా మరికొందరు నేతలు జంపింగ్ కి రెడీ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవిని కూడా బీజేపీలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Image result for చిరంజీవికి BJP

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ పదవీ కాలం ముగిసిపోయిన తరువాత రాజకీయాలకే దూరంగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారాయన. ఏపీ సిఎం జగన్ ను చిరంజీవి కలవడాని కన్నా ముందు ఆయన వైసిపిలో చేరిపోతారన్న ప్రచారం సాగిపోయింది. కానీ చిరంజీవి మాత్రం ఆ ప్రచారానికి స్పందించలేదు. చిరంజీవి చేరితే జాతీయస్థాయి పార్టీలో చేరుతారన్న ప్రచారం మరోవైపు ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఢిల్లీకి వెళ్ళారు. అది కూడా ఉపరాష్ట్రపతి నివాసంలో ఆయనతో కలిసి సైరా సినిమా చూసేందుకు వెళ్ళారు. సినిమా ప్రదర్సనకు ప్రధానితో పాటు పలువురు కేంద్ర పెద్దలకు ఆహ్వానం కూడా అందింది. ఉపరాష్ట్రపతి ఇంటికి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్సి రామ్ మాధవ్, ఎంపి సిఎం రమేష్‌ లు చిరంజీవితో ఉన్నారు. అయితే రాంమాధవ్ చిరంజీవితో రాజకీయాల గురించి మాట్లాడారట.

ఈ క్రింద వీడియో చూడండి

ఏపీలో బిజెపి బలోపేతం దిశగా వెళుతోందని, ఇలాంటి సమయంలో బిజెపిలో కీలక పదవి ఇవ్వడానికి పార్టీ సిద్థంగా ఉందని చెప్పారట. ఆ పదవికి మీరైతే సరిగ్గా సరిపోతారని చిరంజీవికి చెప్పారట రాం మాధవ్. అయితే చిరంజీవి మాత్రం ఏ విషయాన్ని రాం మాధవ్‌తో స్పష్టం చేయలేదట. తరువాత మాట్లాడతానని కను సన్నలతోనే చెప్పేశారట చిరంజీవి. కాకినాడలో ఇటీవల చాలామంది కాపు నేతలు సమావేశమై బిజెపిలో చేరే విషయమై చర్చించారు. చిరంజీవి బిజెపి లో చేరితే కాపు నేతలు పెద్ద ఎత్తున ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే చిరంజీవి బిజెపిలో చేరికపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. కాంగ్రెస్ లోకి చేరినా పెద్దగా క్రియాశీలకంగా లేరు. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి బీజేపీలో చేరతారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. మరి చిరు మళ్ళి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందా.. లేదా సినిమాలు చేస్తేనే మంచిదా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో చూడండి