నారా హఠావో.. ముస్లిం బచావో వైసీపీ నినాదం

439

తెలుగుదేశం పార్టీ ఎటువంటి కార్య‌క్ర‌మం అమ‌లు చేసినా, ఇప్పుడు అవి నెగిటీవ్ ప్ర‌చారం అవుతున్నాయి పార్టీకి.. ముఖ్యంగా తెలుగుదేశం ఇటీవ‌ల మైనార్టీల‌ను దగ్గ‌ర చేర్చుకోవాలి అనుకుని . నారా హమారా, టీడీపీ హమారా పేరుతో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.. ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మం పైనే ఏపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలో ముస్లిం యువ‌కులు త‌మ‌కు న్యాయంచేయాలి, ఇచ్చిన హామీలు నెర‌వేర్చాలి అని ఫ్ల‌కార్డులు ప‌ట్టుకోవ‌డంతో, వారిని అరెస్ట్ చేసి గంట‌ల‌పాటు స్టేష‌న్లో నిర్భందించారు. పేరంటానికి పిలిచి వారిని అవ‌మానించిన‌ట్టు ఉంది ఇప్పుడు ఈ ప‌ద్దతి అని అంటున్నారు యువ‌కులు..మ‌మ్మ‌ల్ని పిలిచింది ఇందుకేనా అని ప్ర‌శ్నిస్తున్నారు.

Image result for chandrababu wear muslim capముస్లిం యువకులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్‌ చేశారు.హామిలను నెరవేర్చమని ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టించడం దారుణమన్నారు… ఇదేనా అధికార పార్టీ మైనార్టీల‌కు ఇచ్చే గౌర‌వం అని ప్ర‌శ్నిస్తున్నారు. ..ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం కనీసం నిరసన తెలిపే స్వాతంత్య్రం కూడా లేదా అని ప్రశ్నించారు. వారి హక్కులను అడిగే బాధ్యత మస్లిం యువకులపై ఉందన్నారు.

Image result for ycp flag

శాంతియుతంగా ప్లకార్టులు ప్రదర్శించడం నేరమా అని ప్రశ్నించారు. 2014లో ముస్లీంలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు. నారా హమారా, టీడీపీ హమారా పేరుతో ముస్లింలను మరొసారి మభ్యపెట్టేందుకు కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.నారా హమారా నహీ అని.. నారా హఠావో.. ముస్లిం బచావో అనే నినాదంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. మొత్తానికి వారిని స‌ముదాయించి పెద్ద‌ల‌తో మాట్లాడించి ఉంటే స‌రిపోయేది అని కాని వారిని ఇలా అరెస్ట్ చేయించే వ‌ర‌కూ వెళ్ల‌డంతో ఇప్పుడు ఇది పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది అని అంటున్నారు.