నంద్యాల‌లో టీడీపీ మ‌రింత జోష్

425

నంద్యాల ఉప ఎన్నికల తర్వాత శిల్పా ఫ్యామిలీ కాస్త రాజ‌కీయంగా నెమ్మ‌దించిన విష‌యం తెలిసిందే.. నంద్యాల ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ త‌ర‌పున జ‌గ‌న్ కూడా ఇక్క‌డ 15 రోజుల పాటు ప్ర‌చారం హోరెత్తించారు.. ప్ర‌తీ వార్డు తిరుగుతూ ప్ర‌చారం చేశారు.. అయినా తెలుగుదేశం పార్టీ ఇక్క‌డ విజ‌యం సాధించింది.. ఇది క‌ర్నూలు జిల్లాలో ఓ చ‌రిత్ర‌గా తెలుగుదేశానికి మిగిలిపోయింది.. తెలుగుదేశం ఇప్పుడు ఇక్కడ ఎటువంటి పొలిటిక‌ల్ గేమ్ ప్లాన్ చేస్తుందో అర్ధం కాని ప‌రిస్దితి వైసీపీకి మారింది. ఇక్క‌డ రోడ్ల వెడ‌ల్పు అని ఆ స‌మ‌యంలో రోడ్ల‌కు ఇరువైపులా ఉన్న రోడ్ల‌ను ఇళ్ల‌ను తొల‌గించారు ఆ ప‌ని కొంత వ‌ర‌కూ సక్సెస్ ఫుల్ గా జ‌రిగింది.

Image result for slip mohan reddy

ఇక నంద్యాల‌లో ఎప్ప‌టి నుంచో భూమా నాగిరెడ్డి భావించిన పేద‌ల‌కు ఇళ్లు ప్ర‌త్యేక కాల‌నీ కూడా భూమా పేరుమీద ప‌నులు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి.. పేద‌ల‌కు ప‌క్కా ఇళ్లు నిర్మిస్తున్నారు..ఈ విష‌యంలో కూడా ప్ర‌స్తుత ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి ప‌నులు వేగ‌వంతంగా చేయించుకుంటున్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం సీఎం చంద్ర‌బాబు మంత్రి లోకేష్ బాగా స‌పోర్ట్ అందిస్తున్నారు … అయితే శిల్పా సోద‌రుడు చ‌క్ర‌పాణిరెడ్డి తన ఎమ్మెల్సీ ప‌ద‌విని కూడా వ‌దిలేశారు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన స‌మ‌యంలో…. ఆయ‌న‌కు శ్రీశైలం టికెట్ హామీ ఇచ్చారు జ‌గ‌న్. ఇటు శ్రీశైలం నుంచి గెలిచి వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి పార్టీ మారిన బుడ్డారాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం త‌ర‌పున పోటీ చేయ‌నున్నారు.

Image result for bhuma brahma

ఇక శిల్పా త‌న‌యుడు ఇక్క‌డ నుంచి పోటీ చేస్తారు అని అనుకున్నా, తాజాగా శిల్పామోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో నంద్యాల నుంచి తానే పోటీ చేస్తున్నాను అని తెలియ‌చేశారు.. దీంతో తెలుగుదేశం పార్టీ మ‌రింత దూకుడు పెంచింది వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ ఈ అభివృద్దిని చూపించి అధికారంలోకి రావ‌డం ఖాయం అని అంటున్నారు ఇక్క‌డ ప్ర‌జ‌లు టీడీపీ కేడ‌ర్..