నందమూరి సుహాసిని ఆస్తులు అప్పులు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

310

ఇప్పుడు రెండు తెలుగు రాష్టాలలో ఒక విషయం గురించే చర్చ నడుస్తుంది.నందమూరి సుహాసిని రాజకీయ రంగ ప్రవేశం గురించే అందరు చర్చించుకుంటున్నారు. నందమూరి కుటుంబంలో పుట్టిన కూడా ఇన్ని రోజులు వినపడని పేరు ఒక్కసారిగా మారుమోగుతోంది.దివంగత టీడీపీ నేత హరికృష్ణ రాజకీయ వారసురాలిగా ఆమె వచ్చే నెలలో తెలంగాణాలో జరగబోయే ఎన్నికలలో పోటీ చెయ్యబోతున్నారు.దాంతో రాష్టంలోని రాజకీయవర్గాల్లో ఆమె ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు.ప్రజా కూటమి పొత్తుల్లో భాగంగా ఆమె కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యనున్నారు.దాంతో అందరు ఆమె గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నారు.అయితే ఇప్పుడు ఆమె ఆస్తులు అప్పులకు సంబంధించిన వార్తలు బయట హల్చల్ చేస్తున్నాయి.మరి ఆ విషయాల గురించి తెలుసుకుందామా.

Image result for nandamuri suhasini

కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని శనివారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాత స్వర్గీయ ఎన్టీఆర్‌, తండ్రి హరికృష్ణల స్ఫూర్తితోనే తాను ప్రజాసేవకు ముందడుగు వేశానని ఆమె పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల్లో ఆమె తన ఆస్తులు, అప్పులను పొందుపరిచారు. ఎల్ఎల్‌బీ పూర్తిచేసిన సుహాసిని, తన వృత్తి సామాజికవేత్తగా పేర్కొన్నారు. ఇళ్ల అద్దెలు ద్వారా తనకు ఆదాయం సమకూరుతోందని తెలియజేశారు. 2018-19 ఆదాయపన్ను రిటర్న్స్‌లో ఆదాయం రూ.10,53,300లుగా పేర్కొన్నారు. తన వద్ద రూ.1,50,000 నగదు, భర్త వద్ద రూ.2,00,000, కుమారుడి వద్ద రూ.లక్ష ఉన్నట్టు తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తన కుటుంబ సభ్యులకు మిక్‌ ఎలక్ట్రానిక్స్, శ్రీభవాని క్యాస్టింగ్‌ కంపెనీల్లో ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.5.50లక్షల షేర్లు ఉన్నాయని, రూ.15లక్షల విలువచేసే హుందాయ్‌ క్రిటా కారు, రూ.71 లక్షల విలువైన 2.2 కిలోల బంగారు ఆభరణాలు, రూ.30 లక్షలు విలువచేసే వజ్రాభరణాలు, రూ.31 లక్షల విలువైన 81 కిలోల వెండి ఉన్నట్టు వెల్లడించారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.1,52,41,493గా పేర్కొంది. భర్త ఆస్తుల విలువ రూ.7లక్షలు, కుమారుడి ఆస్తులు రూ.1,02,60,000గా తెలిపారు. ఫిల్మ్‌నగర్‌లో రూ.4.30కోట్ల విలువచేసే 450 గజాల విస్తీర్ణంలో ఇల్లు… తన భర్తకి తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో రూ.65 లక్షల విలువైన 3.20ఎకరాల పొలం, కుమారుడికి మండపేటలో రూ.88.38 లక్షల విలువైన 2,455 గజాల స్థలం ఉన్నట్టు వివరించారు. రూ.1.46,28,246 వివిధ బ్యాంకుల్లో రుణాలు ఉన్నట్టు అఫిడ్‌విట్‌లో పొందుపరిచారు.చూశారుగా ఆమె పేరు మీద ఉన్న ఆస్థులవివరాలు.,మరి ఈ విషయం గురించి మీరేమంటారు.నందమూరి సుహాసిని గురించి అలాగే ఆమె మీద ఉన్న ఆస్తుల వివరాల గురించి అలాగే ఆమె ఎన్నికలలో గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.