న‌ల్లారి సోద‌రుల ప్రేమ? లేదా పార్టీల‌పై ప్రేమా

410

తెలుగుదేశం పార్టీలోకి వెళితే మ‌న‌కు ఏం లాభం… మ‌హా అయితే సీటు వ‌స్తుంది… గెలిస్తే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది… అది మ‌నం నిర్వ‌ర్తించిన క‌ర్త‌వ్యం కంటే చిన్న‌దే… విన‌గానే షాక్ అయ్యారా… అవును మీరు విన్న‌ది నిజ‌మే….తెలుగుదేశం పార్టీలోకి వెళ‌దామ‌ని ఆగిన మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి మ‌ళ్లీ కాంగ్రెస్ లో యాక్టీవ్ అయ్యారు…మాజీ సీఎం కాబ‌ట్టి కాంగ్రెస్ కూడా రిక్త‌హ‌స్తాలు అందించింది. ఇక పార్టీలో కొన‌సాగుతున్నారు ఆయ‌న.. ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉంది.. ఆయ‌న సోద‌రుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నారు.. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్న‌మీద పోటీ చేయ‌మ‌న్నా చేస్తాను అని చెబుతున్నారు ఈయ‌న‌..

Image result for kiran kumar reddy brothers

ఇక అన్నా ద‌మ్ముల స‌వాళ్లు ఎలా ఉన్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో కిర‌ణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా ఎంపీగా పోటీ చేస్తారా అని ఆలోచ‌న ఇరు పార్టీల్లో వ‌స్తోంది.. తెలుగుదేశం త‌ర‌పున కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం ప‌క్కా అని, ఇప్ప‌టికే ఆయ‌న కేడ‌ర్ చెబుతోంది.. మ‌రోప‌క్క కాంగ్రెస్ పార్టీలో ఆయ‌న అన్న మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారు అని అంటున్నారు..

Image result for kiran kumar reddy brothers

ఇక ఆయ‌న పోటీ చేసేది కూడా ఎక్క‌డ అని అనుకుంటున్నారా గ‌తంలో పురందేశ్వ‌రికి బీజేపీ త‌ర‌పున ఎంపీ సీటు కేటాయించారు గుర్తుందా రాయ‌ల‌సీమ‌లోని .. రాజంపేట‌లో,, ఇప్పుడు కూడా రాజంపేట నుంచి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డిని పోటికి నిల‌పాలి అని భావిస్తున్నారు అని తెలుస్తోంది….తాజాగా ఈ నిర్ణ‌యంతో పీలేరు నుంచి వీరిలో ఎవ‌రు పోటీ చేస్తారు అనేది తెలియాలి.. వీరిలో ఎవ‌రో ఒక‌రు ఇక ఈ ఆలోచ‌న విర‌మ‌ణ చేసుకుంటార‌ని అంటున్నారు నాయ‌కులు.