బిగ్ బ్రేకింగ్ రోజాకు ఘోర అవమానం

226

తమిళ భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ఎక్కువగా ఉన్న నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రోజా రెండు సార్లు గెలిచారు అంటే రికార్డు అని చెప్పాలి. మధ్యలో పదేళ్లు మినహాయిస్తే దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు టీడీపీని గాలి ముద్దుకృష్ణమనాయుడు ముందుండి నడిపించారు. ఈయన ఆకస్మిక మృతితో నియోజకవర్గంలో నాయకత్వ ఖాళీ ఏర్పడింది. బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవడంతో నాయకుడి ఎంపికకు టీడీపీ తీవ్ర స్థాయిలోనే కసరత్తు చేసింది, కాని ఎవరు నిలబడినా తాను గెలుస్తా అని ముందుకు వచ్చారు రోజా. జగన్ కూడా ఆమెపై నమ్మకంతో రెండోసారి నగరి నుంచి టికెట్ ఇచ్చారు.ఈ పర్యాయం ఎలాగైనా నగరిలో పాగా వేయడమే ప్రధాన ధ్యేయంగా ప్రత్యేక శ్రద్ధ చూపించింది. వైసీపీ తరపున నియోజకవర్గ నేతలతో అన్నివర్గాలతో సత్సంబంధాలు కలిగి ప్రజల్లో దూసుకుపోయారు రోజా రెండోసారి గెలిచారు, గెలిచిన తర్వాత ఆమెకు మంత్రి పదవి వస్తుంది అని అందరూ భావించారు, కాని కుల సమీకరణాల మధ్య ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత ఆమెకి జగన్ హామీ ఇచ్చారు మలివిడిత మంత్రి వర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి పక్కా అని తెలియచేశారు. ఈ సమయంలో ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మ‌న్‌గా పదవి కూడా ఇవ్వడం జరిగింది. కాని ఆమెకి ఓ షాకింగ్ వార్త అనే చెప్పాలి.

ఈ క్రింద వీడియో చూడండి

నగ‌రి నేత‌లు ఫైర్ బ్రాండ్ రోజాకే దిమ్మ‌దిరిగే షాకిచ్చారు. ఇటీవల జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో రోజా వైసీపీ అగ్ర‌నేత‌ల‌పై అల‌క‌బూనిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి రంగంలోకి దిగి బుజ్జ‌గించ‌డంతో మెత్త‌బ‌డిన రోజాకు ఏపీఐఐసీ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇటీవ‌లే ఆ బాధ్య‌త‌ల్ని స్వీక‌రించింది రోజా. అయితే ఆమెని స‌న్మానిస్తామ‌ని న‌గ‌రి నేత‌లు ఓ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. రోజాతో పాటు భ‌ర్త సెల్వ‌మ‌ణిని కూడా ఊరేగింపుగా స‌న్మాన స‌భ‌కు తీసుకువ‌చ్చారు. ఒక‌రి వెంట ఒక‌రిని వేదిక మీద‌కు ఆహ్వానించారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే వుంది. స్థానిక నేత‌ల్లో కొంద‌రిని వేదిక పైకి పిలిచారు. ఇక్కడే అసలురచ్చ మొదలైంది.

Image result for roja in nagari

ఇదే వివాదానికి కార‌ణంగా మారింది. న‌గ‌రి మున్సిప‌ల్ మాజీ ఛైర్మ‌న్ కేజే కుమార్ వ‌ర్గీయులకు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డంతో ఒక్క‌సారిగా వేదిక‌పైకి దూసుకొచ్చి రోజాతో గొడ‌వ‌కు దిగారు. త‌న కార‌ణంగానే రోజా వైసీపీలోకి వ‌చ్చింద‌ని, త‌న అండ‌తోనే ఎమ్మెల్యేగా గెలిచింద‌ని మండిప‌డ్డారు. వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి న‌గ‌రిలో కుల రాజ‌కీయాలు ఎక్కువ‌య్యాయ‌ని, త‌మ వంటి వారిని పార్టీ పెద్ద‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఓ కులం ఓట్ల‌తోనే మీరు గెలుపొంద‌లేన‌ది వాద‌న‌కు దిగ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఉన్న‌ట్టుండి న‌గ‌రి మున్సిప‌ల్ మాజీ ఛైర్మ‌న్ కేజే కుమార్ వ‌ర్గీయులు ఎదురుతిర‌గ‌డం రోజా న‌గ‌రిలో పెద్ద షాకే న‌ని చెబుతున్నారు. ఇలా పార్టీ నేతల్లో అసంత్రప్తి రావడానికి కారణం ఏమిటి అనేది తెలుసుకుంటున్నారు, ఈ సంఘటనపై జిల్లా వైసీపీ నేతల నుంచి జగన్ కు ఇప్పటికే రిపోర్టు వెళ్లింది అని తెలుస్తోంది. మొత్తానికి ఇక్కడ వివాదాలకు ఫ్యాన్ పార్టీ ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.