ఓటమితో బాధపడుతున్న నందమూరి సుహాసిని పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు

356

తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజక వర్గాల్లో కూకట్ పల్లి ఒకటి. ఆంధ్రా నుంచి వచ్చి స్థిరపడిన వారి సంఖ్య ఇక్కడ చాలా ఎక్కువ. తెలుగుదేశం బలంగా ఉన్ననియోజకవర్గాల్లో ఇది ఒకటి. అందుకే గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి మాధవరం గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సీటును ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న టీడీపీ అనూహ్యంగా నందమూరి సుహాసినిని రంగంలోకి దింపింది. హరికృష్ణపై ఉన్న సానుభూతి, సెటిలర్ల ఓట్లతో ఈ సీటు గెలవొచ్చని చంద్రబాబు భావించారు. అంతే కాదు.. ఏకంగా చంద్రబాబు, బాలకృష్ణ స్వయంగా ప్రచారం చేశారు.

Image result for naga babu

ఏపీ నుంచి మంత్రులు కూడా ప్ర‌చారం చేశారు ప‌రిటాల సునీత ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు కూడా ప్ర‌చారం చేశారు అన్న కుమార్తె విజ‌యం కోసం బాల‌య్య రోడ్ షో చేశారు…కానీ విజ‌యం అంత సులభం కాదని ప్రాక్టికల్ గా తేలిపోయింది తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో… ఇక్కడ సుహాసిని ఓటమి ఖాయమని గ్రౌండ్ రిపోర్ట్స్ ఎలా వ‌చ్చాయో అలాగే ఫ‌లితాలు కూడా వ‌చ్చాయి.ఈ స‌మ‌యంలో త‌న‌కు అండ‌గా అతి త‌క్కువ స‌మ‌యంలో త‌న పేరు ప్ర‌క‌టించినా త‌న వెంట ఉన్న వారికి అంద‌రికి ధ‌న్య‌వాదాలు అని ఓ లేఖ విడుద‌ల చేశారు సుహసిని, పోరాటం చేశాం ఓడిపోయాం తాము రాజ‌కీయాల్లోనే ఉంటాము అని చెబుతున్నారు కూట‌మి నేత‌లు ఇక ఆమె కూడా అదే తెలియ‌చేశారు.. తాను కూక‌ట్ ప‌ల్లి లో ఉంటాను ఇక్క‌డ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటాను అని అన్నారు ఆమె.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఈ స‌మ‌యంలో ఇప్ప‌టికే బాల‌య్య బాబు ఎవ‌రో త‌న‌కు తెలియ‌దు అని కామెంట్లు చేసి సోష‌ల్ మీడియాలో స్టార్ అయ్యారు నాగ‌బాబు.. తాజాగా ఈ తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల అంశం పై ఆయ‌న మాట్లాడారు అని తెలుస్తోంది. చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయంగా నంద‌మూరి కుటుంబాన్ని వాడుకున్నారు అని, ఏకంగా ఇప్పుడు ఆమెకు టికెట్ ఇచ్చి ఆమె ఓట‌మికి కార‌ణం అయ్యారు అని అన్నార‌ట నాగ‌బాబు. అంతేకాదు ఓ ప‌క్క టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం చూస్తుంటే, టీడీపీ జెండా ఇక్క‌డ ఎగ‌ర‌డం క‌ష్టం అని అన్నార‌ట‌. ఈ విష‌యంలో ఎన్టీఆర్ క‌ల్యాణ్ రామ్ సైలెంట్ గా ప్ర‌చారానికి రాక‌పోవ‌డం మంచిది అయింది అని అన్నార‌ట నాగ‌బాబు… మ‌రి ఇది ఎంత వ‌ర‌కూ వాస్త‌వ‌మో తెలియాలి. మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.