2019 ఎన్నికల్లో వైసీపీపైనే మా పోరాటం రఘువీరారెడ్డి

380

ఎక్క‌డో ఏదో జ‌రిగితే దానికి ఇక్క‌డ విష‌యం కార‌ణం అని అన్నాడ‌ట అలాగే ఉంది ఇప్పుడు ప‌రిస్దితి ఏపీలో… తెలుగుదేశం కాంగ్రెస్ జ‌త‌క‌డ‌తాయా అనేలా ఉంది ప్ర‌స్తుత ప‌రిస్దితి .. తెలుగుదేశం కాంగ్రెస్ ని విమ‌ర్శించ‌దు కాంగ్రెస్ తెలుగుదేశాన్ని విమ‌ర్శించ‌దు.. ఇప్పుడు తాజాగా ర‌ఘువీరారెడ్డి చేసిన కామెంట్లు చూస్తుంటే ఇక వైసీపీ పైకాంగ్రెస్ మ‌రో యుద్దానికి సిద్దం అవ్వాలి అని అనుకుంటోంది… బాబు ఎలాగైనా కాంగ్రెస్ కు స‌పోర్ట్ ఇస్తాడు.. తెలంగాణ‌లో ఎలాగో పోత్తు ఫిక్స్ అయింది.. ఇక మిగిలింది ఏపీ…ఇక్క‌డ కూడా సీఎం కాంగ్రెస్ కు ఆప‌న్న‌హ‌స్తం ఇచ్చేలా ఉన్నారు.. ఇక వైసీపీ ని ఎటాక్ చేయండి అని ఏఐసీసీ కూడా ఆదేశాలు ఇస్తున్న‌ట్లు ఉంది… తాజాగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీపైనే మా పోరాటం అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.

Image result for రఘువీరారెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ప్రజలకు వివరిస్తామని, నాలుగున్నరేళ్లుగా బీజేపీ, టీడీపీలు కలిసి ఉన్నప్పుడు, విడిపోయిన తరువాత కూడా ఏ విధంగా మోసపోయారన్నది ప్రజల్లోకి తీసుకుపోతామన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ సమన్వయ కమిటీ సభ్యులను ఎన్నుకున్నట్లు చెప్పారు. ప్రతి కమిటీలోనూ 15 నుంచి 20 మంది సభ్యులు ఉన్నారన్నారు. అందులో భాగంగా వారికి శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Image result for రఘువీరారెడ్డి

ఇక పాతాళంలో ఉన్న పార్టీ ఈ సారి తెలుగుదేశంతో పొత్తుపెట్టుకుంటుందా అని కూడా ఆలోచిస్తున్నారు.. అయితే నాడు ఎన్టీఆర్ స్ధాపించిన పార్టీ ఇది.. పైగా ఆయ‌న కాంగ్రెస్ తో యుద్ద‌భేరి మోగించి కాంగ్రెస్ నిర్ణయాల‌కు వ్య‌తిరేకంగా స్ధాపించిన పార్టీ.. ఇప్పుడు టీడీపీ అధినేత ఇటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఏమిటి అని ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు తెలుగుదేశం నేత‌లు.