నాది మీ కుల‌మే అదే చెప్పుకుంటా ప‌వ‌న్ క‌ల్యాణ్

266

ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ గా తన రాజ‌కీయ యాత్ర‌లతో ఏపీలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.. ఉత్త‌రాంధ్రా అయిపోయింది ఇప్పుడు గోదావ‌రి జిల్లాల్లో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి.. ఇక త‌ర్వాత సీమ‌లో ఆయ‌న ఎంట‌ర్ అవుతారు అని తెలుస్తోంది.. ఇక ఆయ‌న పొలిటిక‌ల్ గా, త‌న మైలేజ్ ను, మ‌రింత ఈ యాత్ర‌లతో పెంచుకున్నారు అనే చెప్పాలి..ఈ రోజు నుంచి తాను రెల్లి కులస్థుడినని, ఆ విషయాన్ని తాను గర్వంగా చెప్పుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.. తూర్పుగోదావరి జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం అయిన పవన్.. రెల్లి కులస్థులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు..

Image result for pawan kalayan

ఎవ‌రి కులాలు మ‌తాలు చూడ‌కుండా ప‌నిచేసే మీరు మ‌ల‌మూత్రాలు శుభ్ర‌ప‌రిచే మీరు అంద‌రికంటే గొప్ప‌వారు. మీ కులం వాడిని అని చెప్పుకుంటా అని అన్నారు ప‌వ‌న్…ఇల్లు అద్దెకు ఇస్తారా? అని అడిగే దౌర్భాగ్యం మీకు ఏంటమ్మా? వేరేవాళ్లు వచ్చి మిమ్మల్ని అద్దెకు అడగాలి. అలాంటి జీవితాన్ని నేను మీకు ఇస్తాను, మీకు అంద‌రికి ప‌క్కా ఇల్లు వ‌చ్చేలా మ‌నం ఏర్పాట్లు చేస్తాం అని అన్నారు ఆయ‌న‌.. మీకు అంద‌రికంటే పెద్ద మ‌న‌సు ఉంది అని మీరు ఎవ‌రూ బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు అని ప‌వ‌న్ తెలియ‌చేశారు..