వైసీపీకి కీల‌క నేత గుడ్ బై జ‌న‌సేన‌లో ఎంట్రీ

407

తూర్పుగోదావ‌రి జిల్లాలో రాజ‌కీయంగా ఎంతో అనుభ‌వం ఉన్న నేత ముత్తా గోపాల‌కృష్ణ… ఆయ‌న త‌న‌యులతో క‌లిసి తాజాగా వైసీపీని వీడి జ‌న‌సేన‌లో చేరారు . కాకినాడ సిటీలో ముత్తాకు రాజకీయంగా ఇమేజ్‌ ఉంది. గోపాలకృష్ణ తనయుడు శశిధర్‌కి జనసేన టికెట్‌ కోసం ముత్తా పార్టీలో చేరినట్టు ప్రచారం సాగుతోంది… దీంతో జ‌న‌సేన‌కు తాజాగా ఈ సెగ్మెంట్లో హుషారు వ‌చ్చింది అని చెప్పాలి..

Image result for ముత్తా గోపాల‌కృష్ణ

ఆయ‌న గ‌తంలో టీడీపీలో మంత్రిగా, కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా పదవులు చేశారు.. ముత్తా గోపాలకృష్ణకు కాకినాడ సిటీతోపాటు.. జిల్లాలో వైశ్య సామాజికవర్గంలో బలమైన పట్టుంది… అలాగే ఆయన తనయుడు శశిధర్‌ కూడా క్రియాశీల రాజకీయ నేతగా ఎదిగారు. ఈ కారణంగానే గతంలో జగన్‌ సొంత మనిషి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని కాదని.. కాకినాడ సిటీ వైసీపీ కోఆర్డినేటర్‌గా శశిధర్‌ని నియమించారు. ఇటీవల వరకు కాకినాడ సిటీ వైసీపీ అభ్యర్థి శశిధరే అన్న ప్రచారం జోరుగా సాగింది… కాని మ‌ళ్లీ జ‌గ‌న్ ద్వారంపూడికి వైసీపీ కోఆర్డినేటర్‌ పదవి ఇవ్వ‌డంతో ఆయ‌న పార్టీకి దూరం అయ్యారు.

Image result for ముత్తా గోపాల‌కృష్ణఇక త‌మ‌కు విలువ ఇవ్వ‌డం లేదు అని వెంట‌నే పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. ముత్తా చేరికతో ఆయన వర్గంలో ఉన్న పలువురు నాయకులు, కార్యకర్తలు ముత్తా వెనుకే జనసేన తీర్థం పుచ్చుకున్నారు.. గ‌తంలో 2014 ఎన్నిక‌ల్లో అసెంబ్లీ టికెట్‌ రాకపోవడంతో టీడీపీని వీడి ముత్తా శశిధర్‌ వైసీపీలో చేరారు. తాము ఏర్పాటు చేస్తున్న ఇంగ్లీష్‌ న్యూస్‌ ఛానల్‌ ద్వారా ప్రజాసమస్యలపై పోరాడడమే కాదు సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని పవన్‌ అన్నారన్నారు ముత్తా. అనుకోని పరిణామాల మధ్య ఆయన తనను పార్టీలోకి రావాలని కో రారన్నారు. మీ సేవలు మాకు చాలా అవసరమని, మీ అనుభవం పార్టీకి కావాలని పవన్‌ అడిగే సరి కి కాదనలేకపోయానని స్పష్టం చేశారు.