చంద్ర‌బాబుకు ముద్ర‌గ‌డ‌ ల‌క్ష ఆఫ‌ర్

359

తెలుగుదేశం పార్టీ గ‌త ఎన్నికల స‌మ‌యంలో ఇచ్చిన పెద్ద హామీ కాపుల‌ను బీసీల్లో క‌లుపుతాం, కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తాం అని తెలియ‌చేశారు.. అయితే కాపుల‌కు నాలుగు సంవ‌త్స‌రాలు అయినా అధికారంలోకి వ‌చ్చి ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు.. వారు దీనిపై నిల‌దీస్తున్నా వాటిని ప‌క్క‌న పెడుతున్నారు.. ముఖ్యంగా కాపుల డిమాండ్ ఒక‌టే? నాలుగు సంవ‌త్స‌రాలుగాఇచ్చిన హామీ నెర‌వేరుస్తాం అని అన్నారు.. కాని కాపురిజ‌ర్వేష‌న్ల అంశంలో, మమ్మ‌ల్ని మోసం చేయ‌కండి అని గ‌తంలో ఇచ్చిన హామీని నెర‌వేర్చాలి అని కోరారు.

Image result for chandra babu

చివ‌ర‌కు తెలుగుదేశం పార్టీ నాలుగు సంవ‌త్స‌రాల త‌న పాల‌న గ‌డిచిపోయినా, మ‌రో పది నెల‌ల్లో ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతున్నా తాను మాత్రం ఎటువంటి ముందు అడుగు కాపుల రిజ‌ర్వేష‌న్ విష‌యంలో వేయ‌లేక‌పోతోంది.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ త‌ర‌పున కాపులు మంత్రులుగా ఉండి కూడా కాపు రిజ‌ర్వేష‌న్లు సాధించ‌లేక‌పోతున్నారు అని విమ‌ర్శ‌ల పాల‌వుతున్నారు.. ఇక కాపుఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కూడా తెలుగుదేశం అధినేత‌పై ఫైర్ అయ్యారు.

Image result for mudhragada

ఇక తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబు త‌మ‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్ప‌టి వ‌ర‌కూ మాకు హామీ నెర‌వేరుస్తారు అని భావించాము.. ఇక ఆయ‌న మామాట విన‌డం లేదు, ఈ అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో క‌చ్చితంగా మా డిమాండ్ నెర‌వేరిస్తే మీకు ల‌క్ష‌మందితో ఘ‌నంగా స‌న్మానం చేస్తాము అని ముద్ర‌గ‌డ పద్మ‌నాభం తెలియ‌చేశారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది.