ముద్ర‌గ‌డ చేరే పార్టీ పై క్లారిటీ వ‌చ్చింది

384

తెలుగుదేశం పార్టీని న‌మ్మేలేము
జ‌గ‌న్ హ్యాండ్ ఇస్తున్నాడు
ప‌వ‌న్ రిజ‌ర్వేషన్ల‌పై సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.

Image result for ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం

ఇది తాజాగా కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆలోచ‌న.. తెలుగుదేశం ప్ర‌భుత్వం గ‌త ఎన్నిక‌ల్లో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు హామీ ఇచ్చి ఇప్పుడు న‌ట్టేట ముంచింది.. మా హ‌క్కు మా రిజ‌ర్వేష‌న్లు ఇమ్మంటే ఇంట్లో నిర్బంధించి ఎటువంటి దాడుల‌కు కాపుల‌పై తెగ‌బ‌డ్డారో తెలిసిందే అంటూ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తాజాగా కాపు నాయ‌కుల‌తో చ‌ర్చించారట‌.. కాపుల‌ను అంద‌రూ వారి అవ‌స‌రం కోసం వాడుకుంటున్నారు మిన‌హా, మనకు త‌గిన గుర్తింపుని ఎవ‌రూ ఇవ్వ‌డం లేదు అని, చంద్ర‌బాబు నాలుగు మంత్రిప‌ద‌వులు కాపుల‌కు ఇచ్చి కాపు ఓట్లు వ‌చ్చేలా ప్లాన్ వేస్తున్నారు..

Image result for ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం

జ‌గ‌న్ ప‌ది వేల కోట్లు 20 వేల కోట్లు అంటూ కాపుల‌కు, తాను అధికారంలోకి వ‌స్తే ఇస్తాను అని నిధులు పెంచుకుంటూ వెళుతున్నాడు, మిన‌హా మ‌న‌కు రిజ‌ర్వేష‌న్ల పై క్ర‌మమైన హామీ ఏ పార్టీ ఇవ్వ‌డం లేద‌ని.. ఇటు జ‌న‌సేన అధినేత కాపు కాబ‌ట్టి ఆయ‌న కాపుల రిజ‌ర్వేష‌న్ల పై ప్ర‌క‌ట‌న చేస్తే క‌చ్చితంగా బీసీ ఓటు బ్యాంకు ద‌ళిత మైనార్టీ ఓటు బ్యాంకు త‌న‌కు దూరం అవుతుంది అని, ఆయ‌న ఆలోచిస్తున్నారు అని తాజాగా ఆయ‌న అన్నారట‌. ఇక కాపుల ఓటు బ్యాంకు మొత్తం గ‌తంలో గంప‌గుత్త‌గా టీడీపీకి ప‌డింది ఈ సారి ఈ ప‌రిస్దితి ఉండ‌దు అని అంటున్నారు.

Image result for ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం

ఇటు కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశం ప‌క్క‌న పెట్టి తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను అని ఓ విష ప్ర‌చారం స్టార్ట్ చేశారు.. ఇది ఎంత మాత్రం క‌రెక్ట్ కాదు అని తెలియ‌చేశార‌ట.. దీనిపై మీడియా ముఖంగా ఎందుకు అని తెలియ‌చేయ‌లేద‌ట.. తాను కాపుల‌కు ఎవ‌రు అయితే రిజ‌ర్వేష‌న్లు ఇచ్చి మాట నిల‌బెట్టుకుంటారో ఆ పార్టీకి స‌పోర్ట్ చేస్తాను అని తెలియ‌చేశారు అని.. కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రో ప‌క్క ఆయ‌న టీడీపీలోకి అంటూ వ‌చ్చే వార్త‌లో వాస్త‌వం లేదు అని ఫైన‌ల్ గా తేలింది.