ఎంపీ విజ‌యసాయిరెడ్డి మ‌రో ప్ర‌య‌త్నం

448

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎంపీల‌పై వేటు వెయ్యాల‌ని వైసీపీ ఎన్నోసార్లు మాట్లాడింది.. ఈ విష‌యంలో వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పార్ల‌మెంట్లో స్పీక‌ర్ ని కోరారు.. అలాగే అసెంబ్లీలో కూడా స్పీక‌ర్ కోడెల‌ను క‌లిసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై అన‌ర్హ‌త వేటు వెయ్యాల‌ని కోరారు. అయితే దీనిపై ఇటు ఇద్ద‌రు స్పీక‌ర్లు ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

Image result for vijya sai reddy speaker sumithra

తాజాగా మ‌ళ్లీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ను క‌లిశారు… ఫిరాయింపు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు… ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై నెగ్గి, త‌ర్వాత ఈ ముగ్గురు ఎంపీలు తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లోనై పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

Image result for vijya sai reddy speaker sumithra

వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరుతున్నారు. గ‌తంలో తాము ఫిర్యాదు చేసినా అవ‌న్నీ పెండింగ్ లో పెట్టారు అని ఆయ‌న స్పీక‌ర్ దృష్టికి తీసుకువెళ్లారు. అందుకే వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలియ‌చేశారు.. గ‌తంలో రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన శరద్ యాదవ్, అన్వర్ అలీ పై 90 రోజులలో అనర్హత వేటు పడ్డ విషయాన్ని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు.. అలాగే లోక్ స‌భ‌లో కూడా ఇలాంటి ఫిరాయింపుల పై నిర్ణిత స‌మ‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాలని ఆయ‌న కోరారు.

Image result for vijya sai reddy speaker sumithraగ‌తంలో తెలుగుదేశం బీజేపీ మిత్రులు కాబ‌ట్టి వేటు వేయ‌లేదు ఇప్పుడు మళ్లీ ఈ ఆల‌స్యం ఎందుకు అని చ‌ర్చించుకుంటున్నారు నేత‌లు.మొత్తానికి మ‌రో 10 నెల‌లు మాత్ర‌మే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంది.. ఈ స‌మ‌యంలో వారిపై వేటు వేసినా ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం లేదు అని మేధావులు తెలియ‌చేస్తున్నారు… అయితే వారి పై వేటు వేయిస్తే ప్ర‌జ‌ల్లో వైసీపీ గెలిచిన‌ట్టు అవుతుంది అని, అందుకే ఆ నిర్ణ‌యం అని అంటున్నారు నాయ‌కులు.