శివప్రసాద్ గెట‌ప్ ల‌పై మోడీ ఆరా

448

తెలుగుదేశం ఎంపీ శివ‌ప్ర‌సాద్ పార్ల‌మెంట్లో ఏపీకి ప్ర‌త్యేక హూదా కోసం చేస్తున్న పోరాటం పై మిగిలిన ఎంపీలు కూడా ఆలోచిస్తున్నారు.. ఆయ‌న రోజుకో గెట‌ప్ తో రావ‌డంతో ఇప్పుడు పార్ల‌మెంట్ హాల్ బ‌య‌ట పెద్ద చ‌ర్చ కూడా జ‌రిగింది.. ఎంపీలు ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు. ప్ర‌త్యేక హూదా మాట ఇచ్చి మోసం చేసిన న‌రేంద్ర‌మోదీ ని నిల‌దీస్తున్నారు ఎంపీ శిప్రసాద్.. ఇక్క‌డ వ‌రకూ బాగానే ఉంది. ఎంపీ శివ‌ప్ర‌సాద్ వేష‌దార‌ణ‌కు స‌పోర్ట్ ఎలా ఉన్నా ఇటు నాయ‌కులు కూడా ఆయ‌న వేష‌దార‌ణపై చ‌ర్చ‌లు మాత్రం చేస్తున్నారు.. ఇక బీజేపీ ఎంపీలు ఆయ‌న‌తో ఎవ‌రూ ఈ గెట‌ప్ వేసిన తర్వాత చ‌ర్చంచ‌లేదు.. ముఖ్యంగా ఆయ‌న మోడీ పై చేసిన కామెంట్లు బీజేపీ నేత‌ల‌కు న‌చ్చ‌లేదు అని తెలుస్తోంది.. అందుకే బీజేపీ ఎంపీలు కూడా ఈ విష‌యాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ద‌గ్గ‌ర‌కు తీసుకువవెళ్లార‌ట.

Image result for ఎంపీ శివ‌ప్ర‌సాద్

శివ‌ప్ర‌సాద్ చేసిన కామెంట్లు చూస్తే

నీ అంతం ఆరంభం
వెంకన్న సాక్షిగా మాట ఇచ్చీ..
చిచిచి.. చిచిచి… చిచిచిచిచిచీ..ఛీ
వెంకన్న సాక్షిగా మాట ఇచ్చీ పంగనామం పెట్టినావే..
చంద్రబాబుకు కోపమొస్తే… అవుటయ్యిపోతావు.
నీ మీద ఒట్టూ.. అవుటయ్యి పోతావూ..
రైల్వే జోనూ వైజాగ్‌కు ఇవ్వాలి..
స్టీలు ఫ్యాక్టరీ కడపలో పెట్టాలి..
పోలవరం పొంగిపొరలాలీ..
ఇవన్నీ జరగకుంటే… అవుటయ్యిపోతావు…
నీ మీద ఒట్టు..

Image result for ఎంపీ శివ‌ప్ర‌సాద్

బావా… ఎంటి బావా… అవన్నీ చేసేయి బావా… నిన్నందరు మెచ్చుకుంటారు బావా… నువ్వు మాటిచ్చిందే కదా… పో బావా… మళ్లీ కలుస్తాలే… ఇలా ప్ర‌ధానిపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు మండిప‌డుతున్నారు.. అదీ పార్ల‌మెంట్ బ‌య‌ట చేయ‌డం పై బీజేపీ ఎంపీలు విమ‌ర్శిస్తున్నారు దీనిని ఆస్ధాన మీడియాలో చూపించి ప‌బ్బం గుడ‌పుకుంటున్నారు అని టీడీపీ పై విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు బీజేపీ ఎంపీలు.