బాబుకు షాక్ ఇవ్వ‌నున్న ఎంపీ జేసి

557

తెలుగుదేశం ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి వ్యాఖ్య‌లు ఇప్పుడు టీడీపీలో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.. పార్లమెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్న వేళ ఆయ‌న స‌భ‌కు రాక‌పోవ‌డంతో ఇప్పుడు పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది…తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రాజీనామా అస్త్రంతో సీఎం చంద్రబాబును బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అనంతపురంలో విలేకరులతో మాట్లాడిన జేసీ అలాంటిదేమీ లేదని, పైకి చెప్పినా అనంతపురం పార్లమెంట్‌కు సంబంధించిన కొన్ని అంశాల్లో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

Image result for jc diwakar reddy
త‌న మాట చెల్ల‌ని కార‌ణంగా సీఎం చంద్రబాబు జిల్లా నేత‌లు త‌న‌ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, దీంతో జేసి అల‌క‌బూనార‌ట‌.. ఇక వైసీపీ ఎంపీల త‌ర‌హాలోనే ప్ర‌త్యేక‌ హోదా కోసమే రాజీనామా చేశానని చెప్పేలా జేసి ఆలోచిస్తున్నార‌ట‌.. ఎలాగో ఇక రాజ‌కీయాల‌కు సెల‌వు ప్ర‌క‌టిస్తున్న జేసి దివాక‌ర్ రెడ్డి ప‌ది నెల‌ల ముందే ఈ రాజీనామా నిర్ణ‌యం తీసుకుంటారు అని తెలుస్తోంది.

Image result for jc diwakar reddy

ఓ మూడు అంశాల‌పై జేసి తీవ్ర మ‌న‌స్ధాపంతో ఉన్నార‌ని తెలుస్తోంది….అనంతపురంలోని పాతూరులో రోడ్ల విస్తరణకు సంబంధించిన వివాదంలో జేసీ ఒత్తిడి చేసినా అధికారులు పట్టించుకోలేదు. స్దానిక ఎమ్మెల్యే వెనుక సీఎం ఉన్నారని జేసీ భావిస్తున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిని జేసీనే టీడీపీలో చేర్పించారు. ఆయన పార్టీలో చేరి 7 నెలలు గడచినా ఎలాంటి పదవి ఆయ‌నకు ఇవ్వలేదు. ఇక వైసీపీ త‌ర‌పున మ‌రో నేత కూడా ఇక్క‌డ ఫిక్స్ అయ్యారు.. అయితే గుర్నాథ‌రెడ్డి కూడా తీవ్రంగా ఒత్తిడి తేవ‌డంతో ఆయ‌న ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌.

Image result for jc diwakar reddyమాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా మహానాడు వేదికగా టీడీపీలో చేరేందుకు అనుచరులతో కలసి విజయవాడ వెళ్లారు. ఆ స‌మ‌యంలో చంద్రబాబు గుప్తా చేరికను వాయిదా వేశారు.. ఈ మూడు విష‌యాల‌లో సీఎం చంద్ర‌బాబుతో మాట్లాడినా ఎటువంటి చ‌ల‌నం లేద‌ని ఇక పార్టీలో త‌న‌ని క‌రివేపాకులా తీసేస్తున్నారు అని ఆయ‌న మ‌ద‌న‌ప‌డ్డార‌ట.. దీంతో రాజీనామా అస్త్రం ప్ర‌యోగిస్తున్నారు అని తెలుస్తోంది.