ఎంపీ అవంతి శ్రీనివాస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

334

గ‌త కొద్దిరోజులుగా అన‌కాప‌ల్లి ఎంపీగా ఉన్న ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు (అవంతి శ్రీనివాస‌రావు) వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయ‌రు అనే వార్త‌లు వినిపించాయి, ఇక దీనిపై తెలుగుదేశం నాయ‌కుల ఎవ‌రూ పెద‌వి విప్ప‌లేదు, ఆయ‌న కూడా గ‌తంలో దీనిపై ఎటువంటి మాట మాట్లాడలేదు, ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డానికి ఉత్సాహం చూపుతున్నారు అని అంద‌రూ అనుకున్నారు..
ఇప్పుడు తాజాగా దీనిపై ఆయ‌న ఓ క్లారిటీ ఇచ్చారు.

Image result for avanthi srinivas

రానున్న ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తానని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అవంతి కాలేజీలో జరిగిన సమావేశానికి హాజరైన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని చెప్పారు. జిల్లా టీడీపీలో ఎటువంటి వర్గాలు లేవని, అంతా ఏకతాటిపై నడుస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్‌, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని, లేకపోతే రాష్ట్ర ప్రజలు తమ సత్తా ఏమిటో ఎన్నికల్లో చూపిస్తారన్నారు.

Image result for avanthi srinivas

ఇక ఆయ‌న భీమిలి నుంచి పోటీ చేస్తారు అని కూడా తెలుస్తోంది …మ‌రి అన‌కాపల్లి నుంచి ఎంపీగా ఈసారి స‌బ్బం హ‌రి పార్టీలో చేరితే ఇక ఆయ‌న‌కు అవ‌కాశం ఇస్తారేమో చూడాలి. ఇక టీడీపీలో ఈ విషయం పై ఇక చ‌ర్చ‌లు జ‌రుగ‌నున్నాయి.మ‌రి దీనిపై ఇప్ప‌టికే ఆయ‌న బాబుతో చ‌ర్చించారా లేదా ఆయ‌న మ‌న‌సులో మాట తెలియ‌చేశారా అనేది తెలియాల్సి ఉంది