బాబు పై కేసీఆర్ పై మోత్కుపల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

513

తెలంగాణ తెలుగుదేశంలో మ‌రింత వేడి రాజుకుంటోంది.. ఇటు పార్టీ నుంచి మోత్కుప‌ల్లిని బ‌హిష్క‌రించిన త‌ర్వాత కూడా ఆయ‌న తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్ర‌బాబు పై ఫైర్ అవ‌డంతో, టీడీపీ నాయ‌కులు అగ్గి మీద గుగ్గిల‌మ‌వుతున్నారు.. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా న‌ర్సింహులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత ఎన్‌టీ రామారావు తనకు రాజకీయ భిక్ష పెట్టారని, ఆయన దయతోనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.

Motkupalli Narasimhulu Once Again Hits Chandrababu Naidu - Sakshi
చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎన్టీఆర్‌ను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని, ఆరోజుల్లో దారుణాలు చాలా జ‌రిగాయని విమ‌ర్శించారు.. చంద్రబాబు దుర్మార్గుడని తెలంగాణ ప్రజలు తరిమికొట్టే సమయంలో తాను బాబుకు అండగా ఉన్నానని చెప్పారు… తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు తన స్నేహితుడని అయినా కూడా చంద్రబాబును వెనుకేసుకొచ్చినట్లు తెలిపారు.

ఎన్టీఆర్‌ పుట్టిన రోజున తనను బర్తరఫ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు మొదటి ముద్దాయి అని అన్నారు. చంద్రబాబు నమ్మక ద్రోహి, వెన్నుపోటు దారుడని ఘాటు విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన రాజకీయ అసమర్ధుడు బాబు అని మండిపడ్డారు. వంద‌ల కోట్లు దోచుకున్నాడు.. ఎంపీ ప‌ద‌వులు అమ్ముకున్నాడు అని విమ‌ర్శించారు ఆయ‌న‌. ఇక సీఎం ర‌మేష్ కు టీజీ వెంక‌టేష్ కు రాజ్య‌స‌భ సీట్లు అమ్ముకున్నార‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

Image result for chandra babu

చంద్ర‌బాబు అంద‌రికి ప‌ద‌వులు ఇస్తాను అనే భాగంలో పీహెచ్ డీ చేశార‌ని సీనియ‌ర్ నేత గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడిని కూడా ఇలాగే క్షోభ‌కు గురిచేసి చంపారు అని విమ‌ర్శించారు.. త‌న‌ను పోలీసుల‌తో చెదిరించాడు నేను బెదిరిపోను నాకు తెలంగాణ స‌మాజం అండ ఉంది అని ఆయ‌న అన్నారు..చంద్ర‌బాబు ఓడిపోవాలి అని శ్రీవారికి కోరాన‌ని చెప్పారు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు.