బిసి ఓటు బ్యాంకుపై బిజెపి కన్ను…టిడిపి కి షాక్..!

469

రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ ముందుంటాయి..ఈ నేపధ్యంలో బిసి ఓటు బ్యాంకుపై పై బిజెపి కన్నేసింది..బిసిలు మద్దతిస్తున్న ప్రత్యర్ది పార్టీలను చిత్తూ చేయడానికి సన్నద్దమవుతోంది..బిసి కార్పోరేషన్ కు రాజ్యంగా హోదా కల్పించడం ద్వారా దేసవ్యాప్తంగా ఉన్న 45 శాతం బిసిలు తమకు మద్దతిస్తారని మోడీ భావిస్తున్నారు..మోడీ స‌ర్కార్ ఎత్తుగ‌డ‌లు మ‌రీ ముఖ్యంగా ఏపీలో చంద్రబాబుకు నిద్ర ప‌ట్టనివ్వడంలేదు. పార్లమెంట్‌లో బీసీ క‌మిష‌న్‌కు రాజ్యాంగ హోదా క‌ల్పించ‌డం, ఓబీసీ వ‌ర్గీక‌ర‌ణ‌కు మోడీ స‌ర్కార్ శ్రీ‌కారం చుడుతున్నార‌నే స‌మాచారం చంద్రబాబును క‌ల‌వ‌ర‌పెడుతోంది. అందుకే మోడీపై వ్యతిరేక వార్తను మ‌ల‌చడంలో వాడిన ప‌ద‌జాలం తెలుగుదేశం పార్టీకి క‌లుగుతున్న ఇబ్బందిని చెప్పక‌నే చెబుతోంది. టీడీపీ అనుబంధంగా పిలుచుకునే ఒక ప‌త్రిక‌లో కులాల ఆట‌.. ఓట్ల వేట అనే శీర్షిక‌తో మెయిన్ పేజీలో వార్తను ఇచ్చారు.

కేంద్రంలో మరోసారి అధికారం పై కన్నేసిన బిజెపి విపక్షాలు వ్యతిరేకించలేని అంశాలను తెరపైకి తెస్తూ పావులు కదుపుతోంది.. ఎన్డీయే ప‌క్షాల డిమాండ్‌ను మ‌న్నిస్తూ నిన్నటికి నిన్న ఎస్సీ, ఎస్టీ చ‌ట్టం బ‌లోపేతానికి నిర్ణయం తీసుకున్న కేబినెట్‌… 24 గంట‌లైనా గ‌డ‌వ‌క ముందే బీసీ పాచిక విసిరింది. ఓబీసీ క‌మిష‌న్‌కు రాజ్యాంగ ప్రతిప‌త్తి ల‌భించింది అని రాశారు. ఈ అంశాలపై ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త బాబు అసహనాన్ని తెలియజేస్తుంది..నిజానికి మొద‌టి నుంచి తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుద‌న్నుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్‌కు ద‌ళితులు, మైనార్టీలు అండ‌గా ఉండేవారు. కాపులు ఒక్కో సంద‌ర్భంలో ఒక్కో మాదిరిగా మ‌ద్దతుగా ఉంటూ వ‌చ్చారు. ప్రస్తుతం జ‌న‌సేన రాక‌తో కులాల విభ‌జ‌న స్పష్టంగా కనిపిస్తోంది. జ‌న‌సేన‌ను కాపు కాస్తుంటే, అధికార టీడీపీకి బీసీలు, బాబు సొంత సామాజిక వ‌ర్గం, వైసీపీకి మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, జ‌గ‌న్ సొంత సామాజిక‌వ‌ర్గం అండ‌గా ఉంటున్నాయి.

మ‌రోవైపు బీసీ క‌మిష‌న్‌కు రాజ్యాంగ హోదా క‌ల్పించ‌డం, బీసీ వ‌ర్గీక‌ర‌ణ చేప‌ట్టడంలాంటి సంస్కర‌ణ‌లు కేవ‌లం మోడీతోనే సాధ్యమ‌ని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య శుక్రవారం ప్రశంస‌లు కురిపించారు. అంతేకాదు ఢిల్లీలో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి మోడీని ఘ‌నంగా స‌న్మానిస్తామ‌ని ఆయ‌న ప్రక‌టించారు. ఆంధ్రాకు చెందిన బీజేపీ నేత మాట్లాడుతూ ఇంత వ‌ర‌కు మోడీ స‌ర్కార్ రాష్ర్టానికి తీవ్ర అన్యాయం చేసింద‌నే నినాదంతో త‌మ పార్టీని చెల్లని రూక చేయ‌డంతో పాటు తిరిగి అధికారంలోకి రావ‌చ్చని చంద్రబాబు ఆటఆడుతూ వ‌చ్చార‌న్నారు. ఇక‌పై తమ ఆట ఏంటో రుచి చూపిస్తామ‌న్నారు. బీసీల‌తో పాటు ఎస్సీ, ఎస్టీల సంక్షేమ‌మే ప్రధాన ఎజెండాగా సంస్కర‌ణ‌లు తీసుకొచ్చి జ‌నంలోకి వెళుతామ‌న్నారు.