రాహుల్ కు చంద్ర‌బాబుకు ప్ర‌తిప‌క్షాల‌ను ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చిన ప్ర‌ధాని మోడీ

450

ఏపీకి ప్ర‌త్యేక హూదా విష‌యంలో కేంద్రం పై అవిశ్వాసం ప్ర‌వేశ పెట్టిన తెలుగుదేశానికి, అలాగే ప్ర‌తిప‌క్షాలకు పార్ల‌మెంట్లో చుక్కెదురైంది స‌భ‌లో ఫుల్ మెజార్టీ ఉన్న ఎన్డీయేపై అవిశ్వాసం పెడితే వీగిపోతుంది అని తెలిసినా కేంద్రం పై అవిశ్వాసం పెట్టాయి విప‌క్షాలు.. దీంతో మోడీ కూడా ఇదే చుర‌క అంటించారు.. సుమారు 12 గంటల పాటు సుదీర్ఘ చ‌ర్చ త‌ర్వాత, మోడీ ప్రసంగం త‌ర్వాత అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ జ‌రిగింది.

Image result for modiరాత్రి 11 గంటలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు మద్దతు ప్రకటించగా, తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది సభ్యుల మద్దతు లభించింది. దాంతో స్పీకర్ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించి సభను సోమవారానికి వాయిదా వేశారు. దీంతో 12 గంట‌ల‌పాటు ప్ర‌తిప‌క్షాలు ఎంత‌సేపు మాట్లాడినా ఆ మాట‌లు కాని వారుచేసిన చ‌ర్య‌లు కాని అవిశ్వాసం ఓటింగ్ లో అనుకూల‌త కాలేదు.. అస‌లు కేంద్రం అధికారంలో ఉంది పైగా పూర్తి మెజార్టీతో ఉన్న స‌మ‌యంలో మోడీ స‌ర్కారు పై అవిశ్వాసం పెట్ట‌డం అనేది ఓరోజు స‌భా స‌మయం వృధా చేసిన‌ట్లే అని బీజేపీ అంటోంది.

Image result for rahul gandhi

ఇక అవిశ్వాస తీర్మానం పెట్టిన కాజ్ ఒక‌టి అయితే స‌భ‌లో అది మ‌రోలా మారిపోయింది… మోడీ – రాహుల్ ఆలింగ‌నం అంశం విప‌క్ష ఎంపీల కౌంట‌ర్లు దానికి బీజేపీ ఎంపీల కౌంట‌ర్లు, మంత్రుల రియాక్ష‌న్ల‌తో స‌భ సెష‌న్స్ క‌ళ్లార్ప‌కుండా చూసేలా జ‌రిగాయి. ఇటు రాహుల్ ఉద‌యం నుంచి చ‌ప్ప‌ట్లుకొట్టేలా ప్ర‌ధానిపై విమ‌ర్శ‌లు చేశారు, కాని చివ‌ర‌గా రాహుల్ కు విప‌క్ష నేత‌ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించారు.. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ.. ప్ర‌ధాని ప్ర‌సంగం త‌ర్వాత రైట్ టు రిప్లీ కింద టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. ఇక ప్ర‌త్యేక హూదా విష‌యం ప‌క్క‌న పెట్టి కేంద్రం ఈ నాలుగేళ్లు దేశానికి ఏం చేసింది.. అలాగే కాంగ్రెస్ పాల‌న ఎలా ఉండేది.. బీజేపీ పాల‌న ఎలా ఉంది అని ఏక‌ర‌వు పెట్టారు.325 మంది ఎంపీలు వ్యతిరేకంగా నిలవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

Image result for chandra babu

ముందు ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న తెలుగుదేశం ఇప్పుడు ప్ర‌త్యేక హూదా అని మాట మార్చారు అని యూట‌ర్న్ తీసుకుంది బాబు అని ఆయ‌న విమ‌ర్శించారు.. ఇటు కాంగ్రెస్ కూడా ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌లేక మిన్న‌కుండిపోయింది… ఒక‌టా రెండా సుమారు 50 అంశాల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌భ‌లో తెలియ‌చేశారు.. ఎన్డీయేని కూల్చాలి అని అనుకుంటున్నారు.. రాజ‌కీయ పార్టీల వ‌ల్ల ఈ ప‌నికాదు, 125 కోట్ల మంది ప్ర‌జ‌లు చేసే ప‌ని ఆవిష‌యం ప్ర‌జ‌ల‌కు వ‌దిలేయండి అని ధీమాగా చెప్పారు.. రాహుల్ ప్ర‌ధాని అవుతా అంటున్నారు, వారి మిత్ర ప‌క్షాలలో ఈ ఆశ చాలా మందికి ఉంది అని ప్ర‌ధాని కౌంట‌ర్ వేశారు. మొత్తానికి సోమ‌వారం నాడు మ‌ళ్లీ స‌భ ప్రారంభం కానుంది.. ఇక ప్ర‌తిప‌క్షాలు ఎటువంటి కొత్త పందా తీసుకుంటాయో చూడాలి.