చంద్ర‌బాబు ప‌రువు తీసిన మోడీ

629

పార్ల‌మెంట్ సాక్షిగా తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రువును ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మ‌రోసారి తీసేశారు.. రెండు రాజకీయ పార్టీలు వివాదాలు చేసుకుంటూ త‌మ‌ని మ‌ధ్య‌లో ఇరికిస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు.అస‌లు సంఖ్యాబ‌లం లేన‌పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్ర‌తిపాదించారో అర్దం కావ‌టం లేదంటూ మొద‌ట‌గా ప్ర‌ధాని ప్ర‌తిప‌క్షాల‌కు, టీడీపీకి కౌంట‌ర్ ఇచ్చారు.

Image result for chandra babu modi rahul

చంద్ర‌బాబు గురించి మీకు తెలియ‌ని విష‌యాల‌ను చెబుతాను ముందు మీరు వెళ్లి మీ సీట్ల‌లో కూర్చోండి అంటూ మోడి టీడీపీ ఎంపీల‌కు తెలియ‌చేశారు…. ఇక మా నాయ‌కుడ్ని పొగుడుతారు అని అనుకున్న ఎంపీలు త‌మ సీట్లోకి వెళ్లి కూర్చున్నారు. చంద్ర‌బాబును ప‌చ్చి అవ‌కాశ‌వాదిగా మోడి వ‌ర్ణించారు. ప్ర‌త్యేక‌హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని చెప్పిన‌పుడు చంద్ర‌బాబు స్వాగ‌తించిన విష‌యాన్ని గుర్తు చేశారు. ప్ర‌త్యేక ప్యాకేజీనే ముద్దంటూ కేంద్రానికి చంద్ర‌బాబు రాసిన లేఖ‌ను వివ‌రించారు ప్ర‌ధాని మోడీ. ప్యాకేజి ప్ర‌క‌టించిన‌పుడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ప్ర‌శంసించిన విష‌యాన్ని తేదీతో స‌హా ఆయ‌న గుర్తు చేశారు.

Image result for chandra babu modi rahulముందు ప్యాకేజీ కావాలి అన్నారు ఇప్ప‌డు ప్ర‌త్యేక‌హూదా కావాలి అని అంటున్నారు.. ఆనాడు ఒప్పుకున్నారు ఈనాడు మెలిక‌పెడుతున్నారు అని మోడీ టీడీపీని క‌డిగేశారు… ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఎందుకు వెంట‌నే యూట‌ర్న్ తీసుకున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు.. వైసీపీనుంచి వ‌చ్చే ఒత్తిడి ప్ర‌జ‌ల్లో మ‌రింత వీక్ అవుతాము అని వెంట‌నే ప్ర‌త్యేక‌హూదా అనే మాట ఎత్తుకున్నారు అని ఆయ‌న విరుచుకుప‌డ్డారు.. తాను ఫోన్లో చంద్ర‌బాబుతో మాట్లాడిన స‌మ‌యంలో వైసీపి ఉచ్చులో ప‌డ‌ద్ద‌ని చంద్ర‌బాబుకు స్ప‌ష్టంగా చెప్పానంటూ కుండబ‌ద్ద‌లు కొట్టారు ప్ర‌ధాని మోడీ, అయినా ఆయ‌న అదే ఉచ్చులో ఉన్నారు అని తెలియ‌చేశారు.

Image result for chandra babu modi rahul

మీఇద్దరూ అంటే . వైసీపీ -టీడీపీ మ‌ధ్య ఉన్న వైరంలో త‌న‌ను పావుగా వాడుకోవ‌ద్ద‌ని ఆ నాడు చెప్పాను ఇప్పుడు స‌భ‌లో ఈ బిల్లు రావ‌డానికి కూడా అదే కార‌ణం అయింది.. వీరి ఇద్ద‌రూ ఇప్ప‌టికి స‌భ‌ను ఇలానే వాడుకుంటున్నారు అని ఆయ‌న అన్నారు..చంద్ర‌బాబుకు రాజ‌కీయాలు ముఖ్య‌మంటూ మండిప‌డ్డారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న స‌మ‌యంలో చంద్ర‌బాబుకు హ‌టాత్తుగా ప్ర‌త్యేక‌హోదా గుర్తుకు వ‌చ్చిందా అంటూ మండిప‌డ్డారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ..