భ‌విష్య‌త్తులో మోదీకి అదే స‌త్కారం – ర‌ఘువీరా

271

తెలుగు రాష్ట్రాల్లో ఇటు ప్రతిప‌క్షాలు విమ‌ర్శ ప‌క్షాలు అయ్యాయి కేంద్రం పై.. త‌మ ప్ర‌తాపం చూపిస్తున్నాయి తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ జ‌న‌సేన ఇలా నాలుగు పార్టీలు ఏపీకి బీజేపీ అన్యాయం చేసింది అని విమ‌ర్శిస్తున్నాయి అయినా బీజేపీ త‌న పందా మార్చ‌డం లేదు తాము ఏపీకి ఎంతో చేశాము అని చెబుతున్నారు.ఇక ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు చేశారు.

Image result for modi

రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణంలో అవినీతికి పాల్పడిన ప్రధాని మోదీ ఒక దొంగ అని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఇప్పుడు తప్పించుకున్నా భవిష్యత్తులో జైలుకెళ్లక తప్పదని రాజమహేంద్రవరంలో ఆయ‌న అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను బీజేపీ మోసం చేసింది. దగా చేసింది. నాలుగేళ్లపాటు వారితో ప్రయాణం చేసి టీడీపీ కూడా మోసపోయింది. ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, దుగరాజపట్నం పోర్టు, విశాఖ ప్రత్యేక రైల్వే జోన్‌లను కేంద్రం రాష్ట్రానికి ఇచ్చి తీరాల్సిందేనని’ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కడపలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పడం రాష్ట్ర హక్కును వదులుకోవడమేనని రఘువీరా అన్నారు.. మొత్తానికి ఇప్పుడు అన్ని ప‌క్షాలు క‌లిసి బీజేపీ ని వ్య‌తిరేకిస్తున్నాయి.