చంద్రబాబుకి కోలుకోలేని షాకిచ్చిన ప్రధాని న‌రేంద్ర‌మోదీ వెన్నుపోటు

386

ఓ ప‌క్క ఏపీ సీఎం చంద్రబాబు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. ఏపీకి ఎందుకు వ‌స్తున్నారు మేము చ‌చ్చామో బ్ర‌తికామో చూడ‌టానికి వ‌స్తున్నారా, అస‌లు ఎందుకు ఈ పర్య‌ట‌న‌లు అని విమ‌ర్శిస్తుంటే , మ‌రో ప‌క్క ఏపీ బీజేపీ నేత‌లు టీడీపీకి షాక్ ఇస్తున్నారు, ప్ర‌త్య‌క హోదా కాదు ప్ర‌త్యేక ప్యాకేజ్ చాలు అన్న‌చంద్ర‌బాబు ఎందుకు ఇప్పుడు ఇలా రివ‌ర్స్ అయ్యారు అని విమ‌ర్శిస్తున్నారు.
విపక్షాల ప్రతిపాదిత మహాకూటమి అపవిత్ర కూటమి అని ప్రధాని మోదీ తాజాగా విమర్శించారు. రాజకీయ ఉనికి కోసం కొన్ని సంపన్న రాజకీయ కుటుంబాలు జట్టుకట్టాయని ధ్వజమెత్తారు ప్ర‌ధాని మోదీ

Image result for modi

ఈ పార్టీలకు సైద్ధాంతిక సారూప్యత లేదని.. వ్యక్తిగతంగా ఉనికి నిలబెట్టుకోవడానికి చేతులు కలుపుతున్నాయని విమ‌ర్శించారు. తమిళనాడులోని చెన్నై సెంట్రల్‌, చెన్నై నార్త్‌, మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూరు నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘ఆనాడు సొంత పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (టి.అంజయ్య)ని కాంగ్రెస్‌ అవమానించింది. ఫలితంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ ఎన్టీఆర్‌.. టీడీపీని స్థాపించారు. అలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలపాలనుకుంటోంది. ఆ రాష్ట్ర ప్రజలు దీన్నెలా అంగీకరిస్తారు’ అని ప్రశ్నించారు.

Image result for chandra babu

మహాకూటమిలోని కొన్ని పార్టీలు సామాజికవేత్త రాంమనోహర్‌ లోహియా వారసులమని చెప్పుకొంటున్నాయి. కానీ ఆయన కాంగ్రెస్ను, దాని సిద్ధాంతాలను వ్యతిరేకించేవారన్నారు. మహాకూటమి సైద్ధాంతిక నిబద్ధత కలిగింది కాదని మోదీ విమర్శించారు. అధికారం కోసమే తప్ప ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఫ్రంట్‌ కాదన్నారు. వ్యక్తిగత ఆకాంక్షల కోసమే తప్ప.. ప్రజల ఆశయాల కోసం కాదని తూర్పారబట్టారు. కాంగ్రెస్‌ ఏ పార్టీనీ వదల్లేదని.. 1980లో తమిళనాట ఎంజీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దుచేసిందన్నారు. కాంగ్రెస్‌, డీఎంకేలకు పరస్పరం పొసగదంటూ.. జైన్‌ కమిషన్‌ నివేదికపై వివాదాన్ని గుర్తుచేశారు. ఇప్పుడీ రెండు పార్టీలూ ఒకే కూటమిలో ఉన్నాయని, ఇది అవకాశవాదం కాక ఇంకేమిటని మోదీ నిలదీశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వామపక్షాలు కాంగ్రెస్ ను సామ్రాజ్యవాద పార్టీ అని, వ్యవసాయ సంక్షోభానికి అదే కారణమంటూ ఎన్నో తీర్మానాలు చేశాయని గుర్తుచేశారు. ఇప్పుడవి పొగడ్తలు కురిపించుకుంటున్నాయని ఎద్దేవాచేశారు. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ కూడా కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏర్పడిందేనని గుర్తుచేశారు. ‘వాస్తవమేమిటంటే ఈ కూటమి పార్టీలు సంపన్న కుటుంబాల క్లబ్‌కు చెందినవి. పొందికలేని కూటమిని ప్రజలు ఎన్నటికీ అంగీకరించరు. దేశం ప్రజాస్వామ్యాన్ని కోరుతోంది. ఈ కూటమి వంశపారంపర్య పాలన కావాలంటోంది. అందరూ అభివృద్ధి చెందాలని దేశం ఆకాంక్షిస్తోంది. ఈ పార్టీలు తమ కుటుంబాలు మాత్రమే వృద్ధిచెందాలనుకుంటున్నాయి’ అని విమ‌ర్శించారు. బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.