మోడీ దీపావళి బంపర్ ఆఫర్ గంటకి కోటి రూపాయలు లోన్

362

దేశం ఆర్థికంగా దూసుకుపోతుంది.పరిశ్రమలు పెరిగిపోతున్నాయి.పరిశ్రమలకు ప్రభుత్వాలు కూడా చేదోడు వాదోడుగా ఉండటంతో పరిశ్రమలకు కావాల్సిన పెట్టుబడులు ఇస్తున్నాయి.అయితే దేశం ఇంకా అభివృద్ధి చెందాలంటే చిన్న పరిశ్రమలు కూడా పైకి రావాలి.అందుకే మోడీ చిన్న పరిశ్రమలకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for modi

చిన్న మరియు మధ్య పారిశ్రామికవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి బహుమతి ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో చిన్న మరియు మధ్య పరిశ్రమల అభివృద్ధి కోసం MSME లోన్ సౌకర్యాన్ని ప్రారంభించారు. దీని ప్రకారం కేవలం 59 నిమిషాల్లో రూ.కోటి వరకు రుణం మంజూరీ పొందవచ్చు. ఇది కాకుండా చిన్నతరహా వ్యాపారాలకు తీసుకోనే రుణాలపై 2 శాతంమినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

లఘు పరిశ్రమల రంగానికి 12 కీలక నిర్ణయాలను వెల్లడించారు. చిన్న మరియు మధ్య పరిశ్రమలకి ప్రభుత్వ సపోర్ట్ అండ్ ఔట్ రీచ్ ఇనిషియేటివ్ లాంచ్ ఈవెంట్ లో 59 నిమిషాల లోన్ పోర్టల్ లాంచింగ్ ని ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ MSME లేదా లఘు పరిశ్రమల ద్వారా కోట్లాది ప్రజలు ఉపాధి పొందుతున్నారని మోడీ అన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది MSMEలోనే పని చేస్తున్నారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ, లఘు, మధ్య పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.