మోదీ అమిత్ షా జ‌గ‌న్ జెండా వంద‌నం చేసేట‌ప్పుడు చేసిన త‌ప్పులు చూడండి

387

మ‌న నేత‌లు స్వాతంత్ర్య దినోత్స‌వం రోజు స‌మావేశాలు స‌భ‌లు అన్నీ ఆపేసి పార్టీ కార్యాల‌యాల్లో అలాగే క‌లెక్ట‌రేట్ల‌లో ప్ర‌సిద్ద ప్రాంతాల్లో జెండా వంద‌నం చేస్తారు… ఇక రాష్ట్ర‌ప‌తి ప్ర‌ధాని ముఖ్య‌మంత్రి నుంచి స‌ర్పంచ్ వ‌ర‌కూ అంద‌రూ ప‌రిపాల‌న ప‌రంగా జెండా వంద‌నంలో పాల్గొంటారు. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జెండా వంద‌నం స‌మ‌యంలో జ‌న‌గ‌ణ‌మ‌ణ ప‌టిస్టున్న స‌మ‌యంలో ఆయ‌న మంచినీరు త్రాగ‌డం ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.. జెండా వంద‌నం కార్య‌క్ర‌మంలో ఓ ముఖ్య‌ఘ‌ట్టం స‌మ‌యంలో అది కూడా పంద్రాగ‌స్టురోజు ప్ర‌ధాని ఇలా చేయ‌డం పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. ఇక బీజేపీ దేశీయ అధ్య‌క్షుడు ఎంపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు అమిత్ షా కూడా జెండా వంద‌నం రోజు జెండాని గాలిలో రెప‌రెప‌లాడించాల్సింది పోయి.. ఆ జెండాని కిందకి దించారు దీంతో ఈ రెండు సంఘ‌ట‌న‌లు ఒకే రోజు జ‌ర‌గ‌డం బీజేపీ అగ్ర‌నాయ‌కులు ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యారు.

ఇక ఏపీలో కూడా ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా పంద్రాగ‌ష్టు రోజు విశాఖ జిల్లాలో పాద‌యాత్ర‌లో ఉన్నారు.. ఆయ‌న ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు…. ఎర్రవరం జంక్షన్ ద‌గ్గ‌ర పాదయాత్ర విడిది శిబిరం దగ్గ‌ర వైయ‌స్ జగన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేశారు…. చెప్పులు విడిచి స్వాతంత్ర్య సమరయోధుల చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు అక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉంది… ఆ త‌ర్వాతే జ‌గ‌న్ చెప్పులో కాలు వేశారు.. అర్దం కాలేదా ముందు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల చిత్ర‌ప‌టాల‌కు పూల‌మాల వేసి నివాళి అర్పించి… త‌ర్వాతు చెప్పులు వేసుకుని ఆ చెప్పుల‌తోనే జెండా వంద‌నం చేశారు.. ఆవిష్క‌రించారు.. చెప్పులు వేసుకుని జెండా వంద‌నం చేయ‌డం ఏమిట‌ని ఇప్పుడు ప‌లువురు సోష‌ల్ మీడియాలో ఈ వీడియోని వైర‌ల్ చేస్తున్నారు.. ఈవీడియో కూడా ఇప్పుడు వైర‌ల్ అవుతోంది …మ‌రి అధికారంలో ఉన్న నేత‌లు ఇలాగే ఉన్నారు… అధికారంలో లేని నేత‌లు కూడా ఇలానే ఉన్నారు అని విమ‌ర్శ‌లు మాత్రం పెద్ద ఎత్తున వ‌స్తున్నాయి.. దేశ‌భక్తి పై ఈనాయ‌కులు అదీ పంద్రాగ‌ష్టు రోజు ఇలా చేయ‌డం ప‌ట్ల‌ మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.