జ‌గ‌న్ అనే నేను నేమ్ బోర్డ్ సిద్దం చేసిన వైసీపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌నే షాక్ లో బాబు

206

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఓవైపు చంద్రబాబునాయుడు ఈవీఎంల్లో అవకతవకలు అంటూ ఈసీ చుట్టూ తిరుగుతుంటే, మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం ఆ పార్టీ నేతలు ఏకంగా సీఎం నేమ్ ప్లేట్ సిద్ధం చేశారు.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి 48 గంటలు గడిచిందో లేదో.. అప్పుడే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే పేరుతో తయారు చేసిన నేమ్ బోర్డు తయారైంది అనేది సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జరుగుతోంది. ఈ నేమ్ బోర్డు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్, వైసీపీ అభిమానులు ఈ నేమ్ ప్లేట్ ను తెగ షేర్ చేస్తున్నారు. ఎస్..కాబోయే సీఎం జగన్ అని గట్టిగా చెబుతున్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ తెలుగు, ఇంగ్లిష్‌లో రాసిన నేమ్ బోర్డు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఎన్నికల్లో వైసీపీ గెలుపు మీద ఆ పార్టీ ముందు నుంచి ధీమాగా ఉంది. ఈ క్రమంలోనే కేడర్‌లో మరింత ఉత్సాహం నింపేందుకు ‘కౌంట్ డౌన్’ క్లాక్ కూడా ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 11 పోలింగ్ తేదీ నాటికి ఆ కౌంట్ డౌన్ పూర్తయ్యేలా క్లాక్ సెట్ చేశారు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ దశలో వైసీపీది ఆత్మవిశ్వాసమా? అతి విశ్వాసమా అనే చర్చ కూడా మొదలైంది. అయితే, కేడర్‌లో మనోధైర్యం నింపేందుకు ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయినట్టు రాజకీయ పండితులు భావిస్తున్నారు.

వాస్తవానికి ఏప్రిల్ 11న జరిగింది దేశంలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ మాత్రమే. ఇంకా 6 విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగాల్సి ఉంది. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితం ప్రకటిస్తారు. ఈలోపే కొందరు అత్యుత్సాహం చూపి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , ఏపీ సీఎం అని నేమ్ బోర్డు కూడా రెడీ చేశారు. గెలుస్తామనే కాన్ఫిడెన్స్ తో జగన్ కోసం సన్నిహితులు ఈ బోర్డును తయారు చేయించారా? వ్యతిరేక ప్రచారం కోసం ప్రత్యర్థి వర్గాలు ఇలా ప్లాన్ చేశాయా? అన్నది తెలియాల్సి ఉంది.

పలు సర్వేలు కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. ఈసారి భారీ మెజార్టీతో వైసీపీ గెలవడం ఖాయం అంటున్నాయి. ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా ఇదే చెప్పింది. వైసీపీకి 130 అసెంబ్లీ, 20 ఎంపీ స్థానాలు వస్తాయని పీకే సర్వేలో తేలిందట. దీంతో జగన్ ను ఆయన అభినందించారు కూడా. ఏపీ సీఎం జగన్ నేమ్ ప్లేట్ వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అంతిమ ఫలితం ఎలా ఉంటుందో మే 23వ తేదీ తెలుస్తుంది.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈవీఎంల అవకతవకలపై పోరుబాట పట్టారు. ఢిల్లీకి వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేసారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల మద్దతు కూడగడుతున్నారు. ఏపీలో పోలింగ్ రోజున ఈవీఎంల దుర్వినియోగం జరిగిందనేది చంద్రబాబు ఆరోపణ. మ‌రి ఈ ప్లేట్ నిజం అవుతుందా అనేది మ‌రి 40 రోజుల్లో తెలియ‌నుంది.