కోడెల మృతి వెనుక బాబుగారి హస్తం.. వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన కామెంట్స్

151

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని హఠాన్మరణం తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. రాజకీయ కక్ష సాధింపు కోడెల మరణానికి కారణమని టిడిపి నేతలు మండిపడుతున్నారు. ఇక టిడిపి నేతల మాటలను వైసీపీ నేతలు తిప్పి కొడుతున్నారు.

Image result for chandra babu

ఏపీ రాజకీయాల్లో కోడెల మరణం ఊహించని పరిణామం అని అంటున్నారు టీడీపీ నేతలు.రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న ఆయన అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు.టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై పలు కేసులను నమోదు చేసి వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వేధింపులకు గురి చేసిందని దేశంలో ఎక్కడా లేనివిధంగా వైసిపి చేసిన హత్య అని తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం వైసీపీ పై నిప్పులు చెరుగుతున్నారు.అయితే వరుస కేసుల విషయంలో మానసికంగా బాగా కుంగిపోయిన కోడెల తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చానీయాంశంగా మారింది.తాజాగా రోజా కోడెల మృతికి చంద్రబాబు కారణం అని ఆరోపణలు చేస్తారు.

Image result for roja

నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకులైన చంద్రబాబు నాయుడే కోడెల మరణానికి కారణమని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.కోడెల వల్ల ఇబ్బంది పడిన వారు కేసులు పెట్టడంతో ఆయన చంద్రబాబును కలవాలని ప్రయత్నించారని, అయినా చంద్రబాబు మాత్రం ఆయన నన్ను కలవకుండా తీవ్రంగా అవమానించారు అంటూ ఆరోపించారు రోజా.

ఈ క్రింద వీడియో చూడండి

సొంత మామ ఎన్టీఆర్ , వంగవీటి రంగా వంటి వ్యక్తుల మరణం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని పేర్కొన్న రోజా ఇప్పుడు కోడెల మృతి విషయంలో కూడా చంద్రబాబు హస్తం ఖచ్చితంగా ఉందని విమర్శించారు . కోడెలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టలేదని అన్నారు రోజా , ఆ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసులు నమోదయ్యాయని తెలిపారు. తాను నమ్మిన నాయకుడు తనను అవమానించిన ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా రోజా తేల్చేశారు…ప్రస్తుతం ఏపీలో కోడెల ఆత్మహత్య విషయంలో టీడీపీ , వైసీపీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది ..మంత్రి కొడాలి నాని, రోజా కూడా కోడెల ఆత్మ‌హ‌త్య‌పై మాట్లాడారు.