బీకాం ఫిజిక్స్ మ‌ళ్లీ పంచ్ వేశారు ఈ సారి టాపిక్ ఇదే

489

వైసీపీలో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్, ముఖ్యంగా ఇలా ఫిరాయింపు క‌న్నా ఆయ‌న బీకాం ఫిజిక్స్ తో మ‌రింత ఫేమ‌స్ అయ్యారు.. ఇక స‌బ్జెక్ట్ మాట్లాడాల్సింది పోయి అన‌వ‌స‌ర విష‌యాలు సంబంధం లేనివి మాట్లాడితే ఉంట‌ది ఉంట‌ది త‌ర‌హాలో వైర‌ల్ అవుతారు. ఇప్పుడు జ‌రిగింది కూడా అదే.. అందుకే స‌బ్జెక్ట్ పై అవ‌గాహాన ఉంటేనే మ‌నం మాట్లాడాలి కాదు అని నోరు చించుకుంటే ప‌రిస్దితి ఇలానే ఉంటుంది.

Image result for jalil khan vijayawada

బీకాంలో ఫిజిక్స్ చ‌దివాను అంటూ ఆయ‌న ప్ర‌జ‌ల్లో డిబేట్ అయ్యారు ఈ వీడియో ఇప్ప‌టికీ వినోదం పంచుతూనే ఉంటుంది.. ఇక ఇలాంటి జోక్ లు ఆయ‌న నోటి నుంచి రావు అని అంద‌రూ అనుకున్నారు.. కాని ఇప్పుడు ఇటువంటి డిబేట్ మ‌ళ్లీ వ‌చ్చింది. ఇంత‌కీ ఈ సారి ఈ బీకాం ఫిజిక్స్ ఎమ్మెల్యేగారు ఎటువంటి కామెంట్లుచేశారు అని అనుకుంటున్నారా అది చ‌ర్చించుకుందాం.

Image result for jalil khan vijayawada

ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ చేసిందేం లేద‌ని పంచ్ వేసిన జ‌లీల్….రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ నాన్న జగన్ మోహన్ రెడ్డి అంటూ బోలెడంత కామెడీ చేశాడు… వైయస్సార్ జ‌గ‌న్ రిలేష‌న్‌షిప్‌ని రివ‌ర్సులో మాట్లాడి లైవ్‌లోనే దొరికిపోయాడు… ప్ర‌స్తుతం ఆ వీడియో యువ‌త సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ చేస్తున్నారు… అందుకే ప్ర‌జ‌లు చూసే ఈ ప్లాట్ ఫామ్స్ లో చాలా జాగ్ర‌త్త‌గ ఆచితూచి మాట్లాడాలి లేక‌పోతే ఇలా అడ్డంగా ఇరుక్కుపోతారు.