ఏపీ – కేబినెట్లో ఇద్ద‌రికి చోటు ప‌క్కా

345

ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ‌కు తెలుగుదేశం అధినేత మూహూర్తం ఫిక్స్ చేయ‌నున్నారు.. తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టికే అనేక ప్ర‌జా కార్య‌క్ర‌మాల‌తో ముందుకు వెళుతోంది .. అలాగే పార్టీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం రెడీ అవుతున్నారు శ్రేణులు… అందులో భాగంగా, ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది అని భావించి, స‌రికొత్త కేబినెట్ తో ఎన్నిక‌ల స‌మ‌ర‌శంఖారావం పూరించ‌నున్నారు. ఇక కొత్త‌గా మైనార్టీలు ఇద్ద‌రు మంత్రి ప‌ద‌వి కోసం చూస్తున్నారు.. తాజాగా సీఎం చంద్ర‌బాబు ఎప్పుడు కేబినెట్ విస్త‌ర‌ణ చేప‌ట్టినా వారు ఇద్ద‌రూ కూడా లిస్టులో ముందు ఉంటారు.

Image result for ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్
ఇక విజ‌య‌వాడ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్, అలాగే క‌దిరి ఎమ్మెల్యే చాంద్ భాషా వీరిలో ఎవ‌రికి అయినా మంత్రి ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం ఉంది.. ఇక ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వ‌చ్చిన, ఇద్ద‌రూ ఫిరాయింపు అనే మార్క్ వేసుకున్నా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైనార్టీలు పార్టీకి దూరం అవ్వ‌కుండా ఉండాలి అంటే క‌చ్చితంగా మైనార్టీల‌కు ఈ ప‌ద‌వి ఇచ్చి తీరాలి అని టీడీపీ ఆలోచిస్తోంది.. అందులో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు అని అంటున్నారు.

Image result for ఎమ్మెల్యే చాంద్ భాషా

ఇక మైనార్టీ నాయ‌కుల‌తో పాటు ఈసారి కాపు నాయ‌కుల్లో ఒక‌రికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌చ్చు అని తెలుస్తోంది..ఇప్ప‌టికే ఇద్ద‌రు మంత్రి ప‌ద‌వులు ఖాళీ అయ్యాయి.. అందుకే ఈ రెండు ప‌ద‌వుల‌ను ఇప్పుడు భ‌ర్తీ చేయ‌నున్నారు అని తెలుస్తోంది. ఇక ఒక‌టి మైనార్టీల‌కు ఇస్తే మ‌రొక‌టి కాపుల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది అని అంటున్నారు.. మ‌రి చూడాలి బాబుగారి ఆలోచ‌న ఎవ‌రికి ప‌ద‌వి ఇవ్వ‌నున్నారో.