త‌మ ల‌క్ష్యం చెప్పిన మంత్రి నారాలోకేష్

365

తెలుగుదేశం పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోవ‌డం వ‌ల్ల ఎంత న‌ష్ట‌పోయిందో ఇప్పుడు తెలుసుకుంటోంది….తెలుగుదేశం ప్ర‌స్తుతం బీజేపీతో పొత్తునుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌జల్లో కూడా పాజిటీవ్ టాక్ రావ‌డంతో, ఇప్పుడు తెలుగుదేశం బీజేపీపై త‌న వార్ ను కొన‌సాగిస్తోంది… ఇక 2019 ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించ‌డ‌మే త‌మ ముందు ఉన్న ల‌క్ష్యం అని మంత్రి నారాలోకేష్ కూడా తెలియ‌చేశారు..ఏపీకి బీజేపీ న్యాయం చేయ‌లేదు అలాగే అన్యాయం చేసిన వారిని ప్ర‌జ‌లుకూడా న‌మ్మ‌రు వారిని గ‌ద్దె ఎక్క‌నివ్వ‌రు అని అన్నారు ఆయ‌న‌.

Image result for naralokesh

ఇటు ఏపీలో బీజేపీ నాయ‌కులు ఓప‌క్క తెలుగుదేశం ని సెంట‌ర్ చేయ‌డం తెలిసిందే.. దీంతో ఇటు తెలుగుదేశం కూడా బీజేపీ పై విమ‌ర్శ‌ల బాణాలు వ‌దులుతోంది.. ఈ బాణల వ‌ల్ల ఏపీలో బీజేపీ పై ప్ర‌జ‌ల్లో ఉండే పాజిటీవ్ టాక్ ను కూడా క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గిస్తున్నారు.. యూట‌ర్న్ అని అంటున్న బీజేపీ నాయ‌కులు ఇప్పుడు తెలుగుదేశం ని సెంట‌ర్ చేయ‌డంతో తెలుగుదేశం నుంచి కూడా కౌంట‌ర్ అటాక్ మొద‌లైంది.. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్షీనారాయ‌ణ, పురందేశ్వ‌రి, అలాగే ఎమ్మెల్సీ సోమువీర్రాజు, ఎమ్మెల్యేలు ఆకుల స‌త్య‌నారాయ‌ణ ,విష్ణుకుమార్ రాజు, కామెంట్ల‌కు తెలుగుదేశం కూడా గట్టిగా బ‌దులు ఇవ్వాలి అని అనుకుంటోంది.

Image result for naralokeshఇక బీజేపీపై విమ‌ర్శ‌లు వ‌స్తే వెంట‌నే లైన్ లోకి వ‌చ్చే రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహ‌రావును ప్ర‌దానంగా తెలుగుదేశం టార్గెట్ చేసింది..ఆయన తీరు చూస్తుంటే ఆయన ఆంధ్రుడేనా? అనే అనుమానం కలుగుతోందన్నారు మంత్రి నారాలోకేష్‌…కేంద్ర రైల్వే శాఖా మంత్రి పియూష్‌ గోయల్‌ వద్ద టీడీపీ ఎంపీలు అపాయింట్‌మెంట్‌ తీసుకుంటే ఈయన అక్కడికి వచ్చి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఏపీకి ఇవ్వాల్సినదంతా ఇచ్చేశారని ఆయన చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలన్నారు. నిధులు కావాలంటే పంచాయతీలకు ఖాతాలు తెరవమన్నారని, 12,918 పంచాయతీలకు ఖాతాలు తెరిచామన్నారు. ఒక్కో పంచాయతీకి రెండు, 3ఖాతాలు ఉంటాయని, అదేమీ నేరం కాదని వివరించారు.