చైనాలో బిజి బిజిగా లోకేష్

372

ఏపీ సీఎంచంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి నారాలోకేష్ బిజి బిజిగా చైనా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు… వ‌రల్ట్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియ‌న్స్ వార్షికోత్స‌వ స‌మావేశానికి మంత్రి నారాలోకేష్ హాజ‌ర‌య్యారు, ఈ సంద‌ర్బంగా హియర్‌ టెక్నాలజిస్‌ హెడ్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఆపరేషన్స్‌ మెలోడీతో లోకేష్‌ భేటీ అయ్యారు, ప‌లు విష‌యాల‌పై లోకేష్ చ‌ర్చించారు. కంటెంట్‌, ట్రాకింగ్‌, లొకేషన్‌ సర్వీసెస్‌, ఐటీ సేవలను హియర్‌ టెక్నాలజిస్‌ అందిస్తోంది. ఈ కంపెనీ అందిచే సేవ‌ల గురించి ఆ కంపెనీ అధికారుల‌తో మేనేజ్ మెంట్ తో చ‌ర్చించారు అలాగే ఏపీలో ఎటువంటి ప‌రిస్దితి సాఫ్ట్ వేర్ రంగానికి ఉంది ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు అనువైన ప్లేస్ అని లోకేష్ వివ‌రించారు.

Image result for nara lokesh in china

ఇక ఏపీలో ఐటి కారిడార్ వేగంగా అభివృద్ది చెందుతోంది అని తెలియ‌చేశారు ముఖ్యంగా విశాఖ ఐటీ హ‌బ్ గా మారుతోంది అని అక్క‌డ అధికారుల ద్వారా వెల్ల‌డించారు.. ఫ్రాంక్లిన్‌, కాన్డ్యూయెంట్‌లాంటి కంపెనీలు విశాఖకు వచ్చాయన్నారు. ఏపీలో నైపుణ్యం ఉన్న యువతీ, యువకులు ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, కంపెనీ విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలి అని మంత్రి లోకేష్‌ కోరారు. అలాగే అక్టోబర్‌లో జరిగే ఫింటెక్ ఛాలెంజ్ ఈవెంట్‌లో పాల్గొనాల్సిందిగా హియర్ టెక్నాలజిస్ హెడ్ ఆఫ్ గ్లోబల్ ఆపరేషన్స్ మెలోడీని ఆహ్వానించారు.

Related image

వారు కూడా మంత్రి లోకేష తెలియ‌చేసిన విష‌యాలు అన్ని విన్నారు.. దానికి సానుకూలంగా మాట్లాడారు.. వారి ఆర్ అండ్ టీ టీమ్ ద్వారా క‌చ్చితంగా ఏపీలో పెట్టుబ‌డుల విష‌యంలో ఆలోచిస్తామ‌ని తెలియ‌చేశార‌ట ..మొత్తానికి ఏపీకి పెట్టుబ‌డుల విష‌యంలో సీఎం చంద్ర‌బాబు త‌ర‌హాలో మంత్రి లోకేష్ కూడా ముందుకు దూసుకువెళుతున్నారు.