జ‌న‌సేన‌కు అంత సీన్ లేదు టీడీపీ స‌ర్టిఫికెట్

394

తెలుగుదేశం పార్టీ త‌మ‌కు తాముగా సెల్ప్ డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌డంలో ముందు నుంచి అటువంటి పందానే చూపుతోంది…ఇటు వైసీపీ విమ‌ర్శించేది అదే . ఇప్పుడు జ‌న‌సేన నాయ‌కులు కూడా అటువంటి విమర్శ‌లు చేస్తున్నారు.. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క కార్య‌క‌ర్త కూడా వెళ్ల‌రు అని అస‌లు ఎమ్మెల్యేలు ఎలా బ‌య‌ట‌కు వెళ‌తారు అని ఇదంతా రూమ‌ర్స్ అని ప్ర‌చారం చేస్తున్నారు అని మంత్రులు అంటున్నారు.. ఇంత‌కీ అస‌లు విష‌యం వైసీపీలో వ‌ల‌స‌లు ఎలా ఉన్నా, అధికార పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం ఎమ్మెల్యేలు జ‌న‌సేన‌పార్టీలోకి వెళ‌తారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై మంత్రులు ముందు నుంచి విమ‌ర్శ‌లు చేస్తూ ఖండిస్తున్నారు. దీనిని తెలుగుదేశం మంత్రులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఖండిస్తున్నారు.

 

Image result for tdp
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జనసేనలోకి వెళ్లేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈయ‌న స్ప‌ష్టత ఎలా ఉన్నా కొంద‌రు మంత్రులు అయితే వీటిని కూడా ప్ర‌శ్నిస్తారా అని క్వ‌శ్చ‌న్ చేస్తున్నారు మీడియాని జ‌నాన్ని ఇవ‌న్నీ రూమ‌ర్లు అని వారి అర్ధం … జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సీఎం కావాలనే తాపత్రయంతో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.. వైసీపీ అధినేత జగన్‌ అసమర్థుడని మంత్రి దుయ్యబట్టారు….మొత్తానికి మంత్రులు పీతాని స‌త్యానారాయ‌ణ‌, జ‌వ‌హ‌ర్ అందరూ క‌లిసి తెలుగుదేశం పార్టీ నుంచి, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బ‌య‌ట‌కు వెళ్లడం లేద‌ని తెలియ‌చేస్తున్నారు.

Image result for janasena

మ‌రి ఇప్పుడు ఈ ప్ర‌చారం ఎక్క‌డ స్టార్ట్ అయింది… ముద్ర‌గ‌డ కూడా జ‌న‌సేన‌లోకి వెళ‌తారు అని అంటున్నారు… మ‌రో మాజీ మంత్రి కూడా వెళ‌తారు అని ప్ర‌చారం జ‌రుగుతోంది… ఇక ఏలూరులో ఓ మాజీ ఎంపీ జ‌న‌సేన జెండా ప‌ట్టుకోవ‌డానికి రెడీ అవుతున్నారు… న‌ర‌సాపురంలో ఓ సీనియ‌ర్ డాక్ట‌ర్ ఎన్నారై కూడా జ‌న‌సేన జెండా ప‌ట్టుకోవాల‌ని చూస్తున్నారు.. ఇవ‌న్నీ మ‌న జిల్లాలో జ‌ర‌గ‌డంతో ఇది మ‌రింత వైర‌ల్ ప్ర‌చారం కాకూడ‌దు అని తెలుగుదేశం నేత‌లు జిల్లా మంత్రులు నిర్ణ‌యం తీసుకున్నారు, పాల‌కొల్ల నుంచి హ‌రిరామ‌జోగయ్య కుమారుడు కూడా జ‌న‌సేన తీర్ధం పుచ్చుకున్నారు ఆయ‌న కూడా సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు అన్నీ పార్టీల నాయ‌కుల‌తో స‌త్సంబంధాలు క‌లిగిన నేత‌..అని అంటున్నారు జిల్లా నాయ‌కులు…. మ‌రి చూడాలి ఇక తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందో ఇలాంటి విషయాల్లో.