ఏపీకి ప్ర‌త్యేక హూదా పై మంత్రి హ‌రీష్ ఘాటు వ్యాఖ్య‌లు

380

ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇస్తే తెలంగాణ‌కు కూడా ఇవ్వాల్సిందే అని అంటున్నారు తెలంగాణ నాయ‌కులు.. ముఖ్యంగా హూదా మాకు ఇవ్వక‌పోతే ఊరుకునేది లేదు అంటున్నారు… ఈ వ్యాఖ్య‌లు చేసింది నీటిపారుదల శాఖ మంత్రి హ‌రీశ్ రావు…. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఢిల్లీలో కాంగ్రెస్‌ చేసిన తీర్మానంపై మండిపడ్డారు ఆయ‌న . ఇంతకూ ప్రత్యేక హోదా అంటే ఏంటో ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ చెప్పాలన్నారు. ఏపీకి హోదా ఇచ్చి తెలంగాణలో సమస్యలు సృష్టిస్తారా? అని ప్రశ్నించారు మంత్రి హ‌రీశ్.

Image result for Minister Harish.

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఉంటాయని, ఏపీకి హోదా ఇస్తే తెలంగాణలోని పరిశ్రమలన్నీ అక్కడికి తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలోని పరిశ్రమలు మూత పడి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడటాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. ఇదేనా మీరు తెలంగాణ‌లో కోరుకుంటోంది అని ఆయ‌న అన్నారు.

Image result for Minister Harish.

ఇలా చేస్తే తెలంగాణ‌లో ఎటువంటి ప‌రిస్దితి వ‌స్తుందో ముందు నేత‌లు కాంగ్రెస్ నాయ‌కులు తెలుసుకోవాలి అని అన్నారు.. దీనికి హ‌స్తిన కాంగ్రెస్ ఒకే చెబుతుంటే ఇక్క‌డ రాష్ట్ర నాయ‌కులు తానా తందానా అంటున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు….ఆంధ్రాలోని పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేకపోయిందన్నారు.. ముంపు మండ‌లాల‌ను విలీనం చేశారు, అలాగే హైకోర్టు విష‌యంలో ఎటువంటి ముందు అడుగు వెయ్య‌డం లేదు అని ఆయ‌న విమ‌ర్శించారు.

Image result for Minister Harish.

ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ‌లో ప్ర‌జ‌లు ఎటువంటి ప‌రిస్దితి తీసుకువ‌స్తారో చూస్తూ ఉండాలి అని టీఆర్ ఎస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు… ముఖ్యంగా తెలంగాణ‌లో ప్ర‌త్యేక హూదాకు నాయ‌కులు స‌పోర్ట్ చేస్తున్నారా లేదా అనేది, మాత్రం ఇప్ప‌డు ఏపీ ప్ర‌జ‌ల‌కు ఓ స‌మాధానం దొర‌క‌ని ప్ర‌శ్న‌గా మారింది.