టంగ్ స్లిప్ అయిన మంత్రి గంటా కొత్త చిక్కులు

461

విశాఖ రాజ‌కీయాల్లో మంత్రి గంటా స్ధానమే వేరు.. ఉత్త‌రాంధ్రా రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌గా ఉన్నారు ఆయ‌న‌.. ఇక ఇటీవ‌ల పార్టీలో త‌న‌పై జ‌రుగుతున్న విష‌యాల‌లో మంత్రి గంటా అల‌క పాన్పుపైనే ఉన్నార‌ని, త‌న‌పై ఇక్క‌డ ఉన్న మ‌రో మంత్రి క‌క్ష క‌ట్టి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఆయ‌న చాలా మ‌ద‌న‌ప‌డుతున్నారు.. సొంత గూటిలోనే పోరు పెరిగిపోవ‌డం పై ఆయ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డ్డారు.. చివ‌ర‌కు సీఎం చంద్ర‌బాబు గంటాను చ‌ల్లార్చారు.. అయితే తాజాగా మంత్రి గంటా శ్రీనివాస‌రావు రెవిన్యూ అధికారిపై ఫైర్ అయ్యారు.. ఇలా టంగ్ స్లిప్ అవ‌డంతో మంత్రి గారిని జిల్లా రెవిన్యూ అధికారులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

Related image

తన నియోజకవర్గంలోని ఆనందపురం మండలం తాసీల్దార్ పై ఇష్టం వచ్చినట్లు తిట్టేసిన విషయంపై జిల్లా రెవిన్యూ వర్గాలు మంత్రిపై మండిపడుతున్నాయి. నోటి దురుసుతనంతో మండల స్థాయిలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పైనే ఇలా విరుచుకుపడడం ఏంటని ఫైర్ అవుతున్నాయి. మంత్రి ఇలాకాలో అధికారులకు రక్షణ ఏదని ప్రశ్నిస్తున్నాయి. దీనిపైన అమీ తుమీకి రెడీ అయ్యాయి. మంత్రి గంటా ఇంటికి మ‌రీ పిలిచి ఆ రెవిన్యూ అధికారిని ఇష్టం వ‌చ్చిన రీతిలో తిట్టార‌ట‌. ఇక్క‌డ నేను చెప్పింది నువ్వుచెయ్యాలి.. నీ ఇష్టం వ‌చ్చింది నువ్వు చేస్తే కుద‌ర‌దు అని అధికారికి వార్నింగ్ ఇచ్చార‌ట ఇదే విష‌యం ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో అలాగే అధికారుల గ్రూపుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది..

Image result for ganta srinivasa rao

మంత్రి అనుచరులు ఆనందపురం మండలంలో సాగిస్తున్న భూ దందాను తహ‌శీల్దార్ సపొర్ట్ చేయలేదన్న అక్కసుతోనే గంటా ఇలా రెచ్చిపోయారని ఇక్క‌డ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు… ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకుని, ఆ భూములను కాపాడినండుకు మంత్రి అధికారికి ఇచ్చిన బహుమానం ఈ తిట్ల పురాణం. అని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.. ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములకు కూడా నష్ట పరిహారం ఇమ్మన్న టీడీపీ, తమ్ముళ్ళ మాటను ఆ అధికారి పెడ చెవిన పెట్టి రూల్స్ కి కట్టుబడి ఉన్నార‌ట దీంతో స‌ద‌రు మంత్రి ఆయ‌న‌పై విరుచుకుప‌డ్డారు అని తెలుస్తోంది. దీనిపై జిల్లా క‌లెక్ట‌ర్ ద్వారా సీఎస్ దృష్టికి అలాగే సీఎం చంద్ర‌బాబు దృష్టికి ఈ విష‌యం తీసుకువెళ్లాలి అని అనుకుంటున్నార‌ట‌. మ‌రి చూడాలి అధికారులు ఈ విష‌యాన్ని ఎంత వ‌ర‌కూ తీసుకువెళ‌తారో.