జ‌గ‌న్ ఇంటికి భూమ ఫ్యామిలీ

495

వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో ఏ కుటుంబానికి మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు- టికెట్లు ఇవ్వ‌లేదు కాని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు భూమా ఫ్యామిలీకి ఇచ్చారు.. వారు గెలిచేలా చేశారు.. కాని గెలిచిన త‌ర్వాత పార్టీ ఫిరాయించారు భూమ నాగిరెడ్డి ఆయ‌న కుమార్తె అఖిల‌ప్రియ ఆమె మేన‌మామ ఎస్వీ మోహ‌న్ రెడ్డి.. దీంతో రెండు పార్టీలో వివాదాలు మ‌రింత పెరిగిపోయాయి… ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధుత్వం కూడా పక్క‌న పెట్టేశారు ఇద్ద‌రు వైరి వ‌ర్గాలుగా మారిపోయారు.. భూమా మ‌ర‌ణం పై అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న కూడా జ‌గ‌న్ చేయ‌క‌పోవ‌డంతో మ‌రింత వివాదం రాజుకుంది.. అయితే నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య మ‌రింత వార్ ముదిరింది అని చెప్పాలి..

Image result for bhuma akhila priya

ఇక తెలగుదేశం త‌ర‌పున భూమా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యారుచ నంద్యాల‌కు… ఇక మంత్రిగా అఖిల కొన‌సాగుతున్నారు.. ఎస్వీ ఎమ్మెల్యేగా క‌ర్నూలులో ఉన్నారు…. ఇప్పుడు తాజాగా భూమా అఖిల ప్రియ రెండో వివాహం చేసుకుంటున్న విష‌యం తెలిసిందే .. ఆమె మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త భార్గవ్ ని పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఏడాది మేనెల‌లో ఆమె ఎంగేజ్ మెంట్ పూర్తి అయింది..

Related image
ఈ నెల 29న ఉదయం 10:57 గంటలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో ఆమె పెళ్లి జ‌రుగ‌నుంది…ఆమె వివాహానికి వైయ‌స్ జ‌గ‌న్ ను ఆయ‌న ఫ్యామిలీని ఆహ్వానిస్తారు అని తెలుస్తోంది.. మ‌రి జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఉండ‌టంతో ఆయ‌న ద‌గ్గ‌ర‌కు పిలుపు వెళ్ల‌క‌పోయినా వైయ‌స్ జ‌గ‌న్ ఇంటికి వెళ్లి అఖిల పిలుస్తారు అని అంటున్నారు… మ‌రిచూడాలి ఇది ఎంత వ‌ర‌కూ నిజ‌మో .. వైయ‌స్ ఫ్యామిలీకి భూమా ఫ్యామిలీకి బంధుత్వం ఉన్న సంగ‌తి తెలిసిందే.