జనసేన పార్టీ నుంచి మెగా ప్రొడ్యూసర్ పోటీ…!

382

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజా పోరాట యాత్ర పేరిట జిల్లాల్లో బహిరంగ సభలల్లో పాల్గొంటూ, ముఖ్యమైన సంఘాల నేతలతో భేటీ అవుతున్నారు..ఈ క్రమంలో భాగంగా ఆయన వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్దులను పోటీకి పెడతామని చెబుతున్నారు..పవన్ గోదావరి జిల్లాలోని తాజా బహిరంగ సభల్లో కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ తనదైన శైలిలో స్పందించారు..కాపు రిజర్వేషన్లు పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందంటున్నారని విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై బీసీ కులాలకు లాభనష్టాలు వివరించాలని అన్నారు. కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడాల్సి వస్తే టీడీపీలో ఉన్న కాపు నాయకులు ఏం చేస్తున్నారు? అలాగే, ప్రతి బీసీ కులంలో ఉన్న నాయకులు వాళ్ళ వాళ్ల కులాల కోసం ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

నిర్మాత గా మారిన వ్యాపారవేత్త రాం తుల్లురి జనసేన కు సంబందించిన టికెట్ల కేటాయింపు వంటి వ్యవహారాలను అమెరికా నుంచి చక్కబెడుతున్నారు..ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత మెగా కాంపౌండ్ కు సన్నిహితుడు అయిన బన్నీ వాస్ పశ్చిమగోదావరి జిలా పాలకొల్లు నుంచి జనసేన తరపున పోటీ చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి..2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన చిరంజీవి కాంగ్రెస్ అభ్యర్ది ఉషారాణి చేతిలో ఓడిపోయిన విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి..ఈ నియోజకవర్గం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తోంది…తెలుగుదేశం ఆవిర్భవించాక అక్కడ రెండు సార్లు తప్ప అన్ని సార్లు టిడిపి నే విజయం సాదించింది..మరి ఆ నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైకాపా అభ్యర్దుల మధ్య బన్నీ వాస్ విజయం సాదించాలంటే బాగా శ్రమించాల్సి ఉంటుంది..చూద్దాం ఏం జరుగుతుందో..!