జ‌గ‌న్ పై సీరియ‌స్ అయిన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు

370

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితం పై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా మండిప‌డ్డారు ఆయ‌న సోదరుడు నాగ‌బాబు..ఒక పార్టీ అధినేతగా జగన్ స్థాయికి తగిన వ్యాఖ్యలు కావని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు నోరు జారకూడదని, తొందరపాటులో ఎలా పడితే అలా మాట్లాడకూడదని అన్నారు ఆయ‌న‌… పవన్ వివాహానికి సంబంధించి సరైన అవగాహన లేకుండా జగన్ మాట్లాడారని వ్యాఖ్యానించారు.

Image result for jagan

పవన్ ఎవరినీ పెళ్లి చేసుకుంటానని.. నమ్మించి మోసం చేయలేదన్నారు. ఇద్దరి భార్యల నుంచి విడాకులు తీసుకోవడానికి కారణమేంటనేది భార్యాభర్తల మధ్య జరిగిన విషయమని. బ‌య‌ట‌వారికి అన‌వ‌స‌రం అని అన్నారు. పవన్ చట్టబద్ధంగానే విడాకులు తీసుకున్నాడని.. దీనిపై ఎలాంటి వివాదం లేదన్నారు. పవన్ మొదటి భార్య గానీ, రేణూ దేశాయ్ గానీ ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవని నాగబాబు చెప్పుకొచ్చారు. చట్టబద్ధంగా విడిపోయి న్యాయంగా బతుకుతున్న వ్యక్తిపై ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

Image result for naga babu

ఇక వైసీపీ అధ్య‌క్షుడిగా ఉన్న జ‌గ‌న్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఎవ‌రికి న‌చ్చ‌లేదు అన్నారు ఆయ‌న‌…. పవన్‌ను విమర్శించడం వెనుక పొలిటికల్ అజెండా ఉందన్నారు. పవన్‌ను రాజకీయంగా విమర్శించడానికి అవకాశం లేకపోవడంతో వైవాహిక జీవితం గురించి మాట్లాడుతున్నారని ఇది స‌రైన విధానం కాదు అని అన్నారు… ప‌వ‌న్ ని తెలుగుదేశం- వైసీపీ త‌క్కువ అంచ‌నా వేశాయి అని వీరికి బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్దిగా మారేస‌రికి ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారు అని విమ‌ర్శించారు నాగ‌బాబు.