వైసీపీలో చేరిన కీల‌క నేత‌లు

474

ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర తూర్పుగోదావ‌రి జిల్లాలో అశేష‌జ‌న‌వాహిని మ‌ధ్య జ‌రుగుతోంది.. పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల నుంచి భారీగా మ‌ద్ద‌తు వ‌స్తోంది. తాజాగా జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ప‌లువురు టీడీపీ నేత‌లు వైసీపీలో చేరారు.. ఏఎంసీ మాజీ చైర్మన్‌ బాబ్జీ, శ్రీ సంస్థానం మాజీ చైర్మన్‌ రామకృష్ణతో పాటు మరో ఆరుగురు టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు… వీరంద‌రూ పిఠాపురం ప్రాంతానికి చెందిన నేత‌లు.

Image result for jagan padayatra

 

ఇక స్ధానికంగా పార్టీలో చేరిన నేత‌ల‌కు జ‌గ‌న్ సాధ‌రంగా వారిని పార్టీలోకి ఆహ్వానించి.. వారికి పార్టీ కండువాలు క‌ప్పారు.. పార్టీలో అంద‌రూ క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాలి అని అన్నారు.. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్‌ బాబ్జీ మాట్లాడుతూ..టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు హామీలతో మోసపోయామని, మాజీ చైర్మన్‌ అయిన తనకే రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సామాన్యుల‌కు న్యాయం ఎక్క‌డ జ‌రుగుతుంది అని అన్నారు ఆయ‌న‌.

Related image

ఇదే సందర్భంలో మరికొంత మంది చేనేత సంఘాల ప్రతినిధులు కలిసి తమ ఇబ్బందులు వైఎస్‌ జగన్‌తో చెప్పుకున్నారు. జీఎస్టీతో ఇబ్బందులు పడుతున్నామని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేలు చేయాలని విన్నవించుకున్నారు. క‌చ్చితంగా అండ‌గా ఉంటాము అని తెలియ‌చేశారు జ‌గ‌న్.. ఇటు ఇండిపెంటెంగా గెలిచిన ఎమ్మెల్యే వ‌ర్మ తెలుగుదేశంలో చేరారు… ఇక్క‌డ ప్ర‌స్తుతం తెలుగుదేశంలో కొన‌సాగుతున్నారు ఎమ్మెల్యే వ‌ర్మ‌. 100 కోట్ల రూపాయ‌ల అవినీతి ఎమ్మెల్యే వ‌ర్మ చేశారు అంటూ జ‌గ‌న్ కూడా తాజాగా నిన్న‌టి పాద‌యాత్ర‌లో విమ‌ర్శ‌లు సంధించారు.