జగన్ ని అవమానించిన మహేష్ బాబు.. మండిపడుతున్న జగన్ అభిమానులు

264

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి చిన్న దానికి కూడా కొందరు కావాలనే నానాయాగీ చేయటం ఈ రోజుల్లో ఎక్కువ అయ్యింది. అసలు నిజానిజాలు ఏమిటో తెలియకుండా గొర్రెల మందలాగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ప్రముఖ నటీమణి విజయ నిర్మల కన్నుమూశారు. ఆమెకి సంతాపం తెలిపి,కృష్ణ గారిని ఓదార్చటానికి అనేక మంది ప్రముఖులు కృష్ణ ఇంటికి వస్తూనే ఉన్నారు. మొన్న సీఎం వైఎస్ జగన్, కేసీఆర్ నిన్న చంద్రబాబు నాయుడు,బాలకృష్ణ తదితరులు వచ్చారు. అయితే ఇక్కడే మహేష్ బాబు కావాలనే జగన్ ని అవమానించారని జగన్ ఫాన్స్ సోషల్ మీడియాలో అర్ధం పర్థం లేకుండా కామెంట్స్ చేస్తున్నారు.

Image result for mahesh babu and jagan

నిన్న చంద్రబాబు వచ్చిన సమయంలో మహేష్ బాబు బాగా రిసీవ్ చేసుకున్నాడు, వాళ్ళు వెళ్లిపోయేదాకా పక్కనే ఉండి మర్యాదలు చేశాడు, అదే జగన్ వచ్చినప్పుడు కనీసం రిసీవ్ చేసుకోవటానికి కూడా రాలేదు. ఒక ప్రతిపక్ష నేత వచ్చిన సమయంలో ఉన్న మహేష్ బాబు , సీఎం వచ్చినప్పుడు ఎందుకు రాలేదు. కావాలనే జగన్ ని అవమానిస్తున్నారు. నిజానికి కృష్ణకి వైఎస్ ఫ్యామిలీతోనే మంచి అనుబంధం ఉంది. వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు వివాదాల్లో ఉన్న పద్మాలయా స్టూడియో విషయాన్నీ సెటిల్ చేశాడు. మహేష్ సైనికుడు సినిమా విడుదల అయినప్పుడు వరంగల్ లో జరిగిన గొడవలో మహేష్ కి సపోర్ట్ గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలిచాడు.ఆలా కృష్ణ ఫ్యామిలీకి ఎంతో చేసిన వైఎస్ కొడుకు రాష్ట్ర సీఎం జగన్ వస్తే మహేష్ వ్యవహరించే తీరు ఇదేనా అంటూ మాట్లాడుతున్నారు జగన్ అభిమానులు. ఇక గెలిచిన తర్వాత కూడా మహేష్ జగన్ ని కలుస్తారు అని వార్తలు వచ్చాయి అది కూడా జరగలేదు. ఇక ఓటమి చెందిన చంద్రబాబుకు ఇప్పుడు ఆయన ఇంతలా రిసీవ్ చేసుకోవడం పై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే ఇక్కడ ఒక విషయాన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మహేష్ బాబుకి జగన్ తో మంచి అనుబంధమే ఉంది, కావాలని మహేష్ ఇలా జగన్ ని రిసీవ్ చేసుకోకుండా ఉండడు, జగన్ వచ్చే సమయానికి మహేష్ బాబుకి ఏమైనా ముఖ్యమైన పనులు ఉండివచ్చు, అందువలన రాలేకపోయి ఉండవచ్చు తప్పితే ఒకరు ఎక్కువ..ఒకరు తక్కువ అని మాత్రం కాదు.. ఇలాంటివి ఏమి పట్టించుకోకుండా చావు దగ్గర కూడా రాజకీయాలు చేసే ఫ్యాన్స్ ఉన్నంత కాలం ఇలాంటి న్యూస్ వస్తూనే ఉంటాయి అనేది నిజమైన జగన్ ఫ్యాన్స్ చెప్పేమాట…… ఇక అలా ఆలోచిస్తే ఇటీవల పార్టీ నుంచి బయటకు వచ్చిన కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కూడా జగన్ వచ్చిన సమయంలో పక్కన ఉన్నారు, ఈ సమయంలో విజయసాయిరెడ్డి పక్కన శేషగిరిరావు కూర్చున్నారు, రాజకీయాలు అన్నింటా పనిచేయవు అంటున్నారు జగన్ అభిమానులు. మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.