ప‌వ‌న్ కు ప్ర‌త్యేక బ‌స్సు రెడీ

455

సీఎం అంటే ప్ర‌చార ర‌థాల‌కు కొద‌వ ఉండ‌దు ఇక ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆ పార్టీ నాయ‌కులు కూడా త‌మ ప్ర‌చార ర‌థాల‌ను, సీఎం ర‌థాల కంటె మెరుగ్గా త‌యారు చేసుకుంటారు.. ఇక్క‌డ సీఎం చంద్ర‌బాబు ఈ విష‌యంలో ఎప్పుడూ ముందు ఉంటారు.. ఆయ‌న ప్ర‌చార ర‌థం ఇప్ప‌టికీ ఏపీలో టాప్ ..ఇక ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ కూడా ఓదార్పుయాత్ర‌ల నుంచి ఈ ర‌థాలు ఆయ‌న‌కు అలావాటు అయ్యాయి…. ఇప్పుడు రాజ‌కీయాల్లోకి కొత్త‌గా వ‌చ్చి పోటికి సిద్దం అయిన జ‌న‌సేనాని కూడా ఈ ర‌థ‌చ‌క్రాన్ని రెడీ చేసుకుంటున్నారు..

Image may contain: 6 people, people standing

ఇక జ‌న‌సేనానికి ఆయ‌న స‌న్నిహితుడు ప్ర‌చార ర‌థాన్ని సిద్దం చేశారు.. ఆయ‌న ఎవ‌రో కాదు టీవీ 99 చానెల్ య‌జ‌మాని తోట చంద్ర‌శేఖ‌ర్.. ప‌వ‌న్ కోసం ఖ‌రీదైన ప్ర‌చార రథాన్ని సిద్దం చేస్తున్నారు.. ఇందులో టీవీ నెట్ అందుబాటులో ఉంటుంది.. అలాగే ప‌వ‌న్ విశ్రాంతి తీసుకోవాలి అంటే బెడ్ ఉంటుంది.. 8 సిట్టింగ్ సోఫా సెట్ ఫ్లాస్మా టీవీ ఉంటుంది.. ఇక ఫుల్ ఎయిర్ కండిష‌న‌ర్ తో ఈ బ‌స్సు నిర్మిత‌మైంది. ఇక జ‌న‌సేనాని ఫోటోల‌తో పాటు జ‌న‌సేన గుర్తు జెండా స్టిక్క‌రింగ్ చేస్తున్నారు.. ప‌వ‌న్ న‌మ‌స్కారం చేసే ఫోటోని ముందు ఉంచ‌నున్నారు.. దీనిపై ప‌వ‌న్ ప్ర‌చారం చేయనున్నారు అని తెలుస్తోంది.

Image may contain: 4 people, people smiling, beard

ఇక ఆయ‌న ఈ ప్ర‌చార ర‌థాల పై తెలుగురాష్ట్రాల్లో ప్ర‌చారం చేస్తారు.. అనంత‌పురం నుంచి ఆయ‌న ర‌థ‌యాత్ర ఉంటుంది అని తెలుస్తోంది.. ఇటు తెలంగాణ‌లో కూడా న‌ల్గొండ నుంచి ఆయ‌న యాత్ర ఉంటుంది అని అంటున్నారు.. మ‌రి దీనిపై ఓ షెడ్యూల్ వ‌స్తే కాని రూట్ మ్యాప్ తెలియ‌దు అంటున్నారు మేధావులు.. ప‌వ‌న్ రాక‌కై ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సైనికులు మాత్రం ఎదురుచూస్తున్నారు.